పవన్ కల్యాణ్ విమర్శలను తిప్పికొట్టిన నారా లోకేష్

పవన్ కల్యాణ్ విమర్శలను తిప్పికొట్టిన నారా లోకేష్

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. టీడీపీ ప్రభుత్వం స్థానికులకు కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెడుతుందని పవన్ చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా ఆయన సమాధానం ఇచ్చారు. 
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఫార్చ్యూన్- 500 కంపెనీల్లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఒకటి అని చెప్పారు. ఆ కంపెనీ ఏపీలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుందని చెప్పారు. 

స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందనే పవన్ విమర్శలోనూ పస లేదని అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసే ఈ కంపెనీ సీఈవో శ్రీనిబాబు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని చెప్పారు. శ్రీకాకుళంలో వెయ్యి మంది స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేలా బీపీవో కంపెనీ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. 

 ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ ఓ ఆకతాయి.. పవనేమో అవగాహన లేని నాయకుడని ఆయన ప్రకాశం జిల్లాలో వ్యాఖ్యానించారు. 

జగన్, పవన్.. వారిద్దరూ మోడీని తమల పాకులతో.. చంద్రబాబునేమో చెక్కలతో కొట్టినట్లుగా విమర్శిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page