తన మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ సాక్ష్యాలను  బయటపెట్టాలని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.


అమరావతి: తన మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ సాక్ష్యాలను బయటపెట్టాలని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన మీద ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి అవినితి కార్యక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలు చూపాలన్నారు. తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

అగ్రిగోల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిపాజిట్లను సేకరించిందన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు కేసులో ఉందన్నారు.

అగ్రిగోల్డ్‌కు చెందిన హయ్‌ల్యాండ్ ప్రాపర్టీ విషయమై తన మీద ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఈ భూములకు తమకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు డబ్బులను చెల్లిస్తున్నట్టు లోకేష్ ప్రకటించారు.

హాయ్‌ల్యాండ్ విషయమై ఒక పార్టీ ఆరోపణలు చేస్తోందని వైసీపీ పేరును లోకేష్ ప్రస్తావించారు. వైఎస్ హాయంలో అగ్రి గోల్డ్ డిపాజిట్లు సేకరిస్తే టీడీపీ ఎలా తప్పులు చేసిందని చెబుతారని ఆయన ప్రశ్నించారు.

కోర్టు ఆధీనంలో ఆస్తులను ఎలా కొనుగోలు చేస్తాం, ఎలా రిజిష్టర్ చేస్తామో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఏం ప్రయోజనమన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఏం చెబుతామన్నారు హెచ్‌సిఎల్ కంపెనీ అమరావతిలో ఏర్పాటు చేస్తే తనకు కప్పు కాఫీ ఇచ్చారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అది కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే: నారా లోకేస్ వ్యంగ్యం

చంద్రబాబు కుటుంబం ఆస్తులివే: దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 18.72 కోట్లు