వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలను సంపాదించడం ఎలానో తనకు తెలియదని ఏపీ  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి   నారా లోకేష్  చెప్పారు


అమరావతి: వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలను సంపాదించడం ఎలానో తనకు తెలియదని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలు సంపాదించడం ఎలానో నేర్చుకోవాలన్నారు.

బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను చూసి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలన్నారు. ఎకరానికి కోటి రూపాయాలను వ్యవసాయం చేసి కేసీఆర్ సంపాదించినట్టు తాను విన్నానని లోకేష్ గుర్తు చేశారు. 

తనకు తెలిసి ఎకరానికి కోటి రూపాయాలు సాధ్యం కాదన్నారు. ఇలా సంపాదించడం ఎలా చెబితే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర,కర్ణాటకకు చెందిన రైతులు కూడ సంపాదిస్తారని లోకేష్ చెప్పారు.

తాను కూడ అగ్రి వ్యాపారం చేశానన్నారు. కానీ, వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాల ఆదాయాన్ని సంపాదించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో కోటి రూపాయాల ఆదాయాన్ని సంపాదించడం నేర్చుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు కుటుంబం ఆస్తులివే: దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 18.72 కోట్లు