Asianet News TeluguAsianet News Telugu

గాలిగాడివైన ఓ జగన్ రెడ్డి... పోలవరంపై సిబిఐ విచారణకు సిద్దమా...: నారా లోకేష్ సవాల్

ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాంతాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసిత ప్రజలను ఆయన పరామర్శించారు.

nara lokesh demands cbi inquiry on polavaram rehabitation package
Author
Polavaram, First Published Aug 31, 2021, 4:53 PM IST

పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నిర్వాసితుల త్యాగాల ఫలితమే పోలవరం అని అన్నారు. ఇది కేవలం 1.90 లక్షల మంది చిన్న సమస్య మాత్రమేనని వైసిపి నాయకులు అంటున్నారు... కానీ ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని లోకేష్ అన్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసిత ప్రాంతాలను లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసిత ప్రజలను ఆయన పరామర్శించారు. కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో నిర్వాసితులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తే    ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలవరాన్ని చంపేస్తున్నారన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలక్షేపం తప్ప ప్రాజెక్ట్ ముందుకు కదిలింది లేదన్నారు. 

''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలి కబుర్లు చెప్పి గిరిజనుల్ని మోసం చేసిన గాలిగాడు జగన్ రెడ్డి. గిరిజనుల దగ్గరకొచ్చి ముద్దులు పెట్టాడు, మొసలి కన్నీరు కార్చాడు, మోసపు హామీలు ఇచ్చాడు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అన్నాడు. భూమికి భూమి, పోడు భూమికి పట్టా, 18 ఏళ్ల నిండిన వారందరికీ ప్యాకేజ్ ఇస్తా అని హామీ ఇచ్చాడు. ఆర్అండ్ఆర్ కింద పది లక్షల ప్యాకేజి, ఎకరానికి రూ.1.50 లక్షల ప్యాకేజ్ వచ్చిన వారికీ అదనంగా 5 లక్షల ప్యాకేజ్ ఇస్తా అన్నారు. మెమొచ్చాకా ఎకరానికి రూ.19 లక్షల ప్యాకేజ్ ఇస్తామంటూ గాలి కబుర్లు చెప్పాడు ఈ గాలిగాడు జగన్ రెడ్డి. 25 రకాల సౌకర్యాలతో నిర్వాసితులకు పునరావాస కాలనీలు కడతాం అన్నారు. కట్టారా? ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకొని వాడిని ఏమంటాం? గాలిగాడు అంటాం'' అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. 

read more  వెలిగొండ ప్రాజెక్ట్‌: కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

''జగన్ రెడ్డి గిరిజనుల పాలిట శాపంగా మారారు. ప్రతిపక్షంలో హామీల వర్షం కురిపించిన జగన్ రెడ్డి ఇప్పుడు గిరిజనుల గుండెల పై గునపం దింపుతున్నాడు. జేసీబీలు పంపి ఇళ్లు కూల్చేస్తున్నారు. పరిహారం, పునరావాసం పూర్తవ్వకుండా గిరిజనుల ఇళ్ళు కూల్చే హక్కు నీకెవడిచ్చాడు జగన్ రెడ్డి? పోలీసుల్ని పంపి ఊర్లు ఖాళీ చెయ్యాలంటూ భయపెడుతున్నారు. కొండ పైకి వెళ్లి పాక వెనుకుందాం అనుకుంటే దానికి ఒప్పుకోవడం లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే వ్యవసాయం చేసుకున్న మీరు సొంత ఊరుకి రావాలంటే అధికారుల అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి. జగన్ రెడ్డి పాలనలో పోలవరం నిర్వాసితులు మానసిక క్షోభకి గురవుతున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశాడు.

''జగన్ రెడ్డి జిఓ లు నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అందుకే ఇప్పుడు ఆ జిఓ లు కూడా రహస్యంగా పెట్టుకుంటున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని వాడు పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తాడా? చంద్రబాబు హయాంలో 33 వేల కోట్ల పునరావాస ప్యాకేజీకి కేంద్రం ఒప్పకుంటే ప్రతిపక్షంలో ఉండి జగన్ పుల్లలు వేసి అడ్డుకున్నాడు. గతంలో హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు పరిహారం ఇవ్వాల్సింది కేంద్రం అంటూ జంప్ అయిపోతున్నారు. 275 గ్రామాలకు గాను 9 గ్రామాలకు మాత్రమే పరిహారం అందించారు. అది కూడా అంతంత మాత్రమే. ఈ స్పీడ్ లో పరిహారం ఎప్పటికి అందుతుంది. గుజరాత్ సర్దార్ సరోవర్ డ్యామ్ కి పట్టిన దుస్థితి జగన్ పాలనలో పోలవరానికి వచ్చింది'' అన్నారు. 

''41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల కోసం రూ.3,200 కోట్లు కావాల్సి ఉంటే రూ.550 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు... ఇవి కూడా కాగితాలకే పరిమితం అయ్యింది... మొత్తం ఇవ్వలేదు. నిర్వాసితులకు ఇచ్చిన వాటిలో రూ.100 కోట్లు అవినీతి జరిగింది. నిర్వాసితులు పరిహారం కోసం ఎదురు చూస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం నిర్వాసితుల పేరుతో పరిహారాన్ని దోచుకుంటున్నారు. నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారం వైసీపీ ఎమ్మెల్యేలు, వైకాపా కుక్కలు కొట్టేసారు. పోలవరం నిర్వాసితులకే తెలియకుండా ఎవరిదీ కాని భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్ముని కాజేస్తున్నారు. గిరిజనుల పేరుతో వారికి తెలియకుండా ఖాతాలు తెరిచి, పరిహారం డబ్బులు వేసుకుని, వారికి తెలియకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు. జగన్ రెడ్డి కి దమ్ముంటే పునరావాస ప్యాకేజీలో వైసిపి దోపిడీ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

''జూన్ 2020 నాటికే 18 వేల నిర్వాసితులను ఇళ్లలోకి పంపిస్తామని, మిగిలిన వారిని 2021 మే నాటికి పంపిస్తామని ఇరిగేషన్ మంత్రి  డబ్బాలు కొట్టారు. ఏమయ్యాయి  ఆయన చెప్పిన మాటలు? నోటి పారుదల మంత్రి అనిల్ కి నీటిపారుదలపై అవగాహన నిల్లు'' అంటూ ఎద్దేవా చేశారు. 

''గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఐదేళ్లలో పోలవరం నిర్మాణానికి ఖర్చుపెట్టింది కేవలం రూ.5,135 కోట్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రయ్యాక రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టి ఐదేళ్ల లోనే 72శాతం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఈ రెండేళ్ళలో జూన్ మొదటి వారానికి రూ.845 కోట్లు ఖర్చు చేశారు. వాటిలో కేవలం డ్యాంసైట్ కు రూ.445 కోట్లు ఖర్చు పెట్టారు. 4 శాతం మాత్రమే పూర్తి చేసారు'' అన్నారు. 

''పోలవరం నిర్వాసితులకు ఈ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నా ఎస్టీ వర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు. అసలు ఎస్టీ ప్రజా ప్రతినిధులకు అపాయింట్మెంట్ కూడా సీఎం ఇవ్వడం లేదు. గతంలో చంద్రబాబు కట్టిన ప్రాజెక్ట్ వద్దకెళ్లి ఫొటోలు దిగి, అంతా తామే చేశామని చెప్పుకోవడం కాదు? చేతనైతే గిరిజనుల ముందుకెళ్లి నిలబడండి. జగన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకూ వారికి అండగా టీడీపీ పోరాటం చేస్తుంది. చిట్టచివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకూ నేను ఈ పోరాటంలో ముందుటాను'' అని నారా లోకేష్ స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios