Asianet News TeluguAsianet News Telugu

తెలుసుకుని మాట్లాడు: పవన్ కల్యాణ్ కు నారా లోకేష్ కౌంటర్

ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సూచించారు. 

Nara Lokesh conters Pawan Kalyan on Uddanam issue

విజయవాడ: ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సూచించారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు ఆయన వివరాలతో కూడిన కౌంటర్ ఇచ్చారు.

పవన్‌కళ్యాణ్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు తాగునీరందిస్తున్నట్లు కూడా తెలిపారు. 

136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నామని. నాలుగు నెలల్లో 15 మొబైల్ టీమ్స్‌తో లక్ష మందికి స్క్రీనింగ్ టెస్టులు చేశామని తెలిపారు. చంద్రన్న సంచార వాహనాల ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. 

సోంపేటలో నూతన ల్యాబ్ ఏర్పాటు చేశామని లోకేష్ చెప్పారు. కిడ్నీ వ్యాధి బాధితులకు రూ. 2500 పెన్షన్ ఇస్తున్నామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios