పవన్ కల్యాణ్ కు నారా లోకేష్ సవాల్: జగన్ పై ఫైర్

Nara Lokesh challenges Pawan Kalyan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద, జనసేన చీఫ్ పవన్ కల్యామ్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద, జనసేన చీఫ్ పవన్ కల్యామ్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆధారాలు ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన పవన్ కల్యాణ్ ను సవాల్ చేశారు. పవన్ ను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

తమ పార్టీ ఏ రోజు కూడా నీచమైన రాజకీయాలు చేయలేదని అన్నారు. ఏటా ఆస్తులు ప్రకటిస్తున్న కుటుంబం ఏదైనా రాజకీయాల్లో ఉందంటే అది తమ కుటుంబం మాత్రమేనని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే దమ్ముందా అని లోకేష్ జగన్ ను ప్రశ్నించారు. జగన్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాలు చేసి ప్రజలకు పంగనామాలు పెడుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం ఓ డ్రామా మాత్రమేనని అభిప్రాయపడ్డారు. 

loader