Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పుట్టిన రోజు... బావ లోకేష్ స్పెషల్ విషెస్..!

ఈ సందర్భంగా ఆయనకు వేలల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఆయన బావ, టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.
 

Nara Lokesh Birthday wishes to Jr.NTR
Author
Hyderabad, First Published May 20, 2021, 1:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 38వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేలల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఆయన బావ, టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

‘ తారక్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

 

ఇదిలా ఉండగా.. సాధారణంగా ఎన్టీఆర్ బర్త్ డే అంటే.. అభిమానులు సంబరాలు చేసుకునేవారు.అయితే.. ఈ ఏడాది వేడుకలు జరపొద్దంటూ ఎన్టీఆర్ అభిమానులను రిక్వెస్ట్ చేయడం గమనార్హం.

ఈ సారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు.. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని' జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బహిరంగంగా లేఖ రాశారు. మే 10 న జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనతోపాటు కుటుంబ సభ్యులు హోం క్యారంటైన్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ.. తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నారు.

"గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలను చూస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకెంతో ఊరటను కలిగిస్తున్నాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను చాలా బాగున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ, ఈ ఏడాది మాత్రం మీరంతా ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరిచ్చే అతి పెద్ద కానుకలా భావిస్తానని" ఎన్టీఆర్ పేర్కొన్నారు. 

 అలాగే "ఇది వేడుకలు చేసుకునే టైం కాదు. ఇండియా కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మనం సంఘీభావం తెలపాలి. ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాల్సిన సమయం. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు మనమందరం కలిసి వేడుక చేసుకుందాం.." అని ఎన్టీఆర్‌ అభిమానులకు లేఖ రాసుకొచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios