'కెమికల్స్‌తో ఆరోగ్య సమస్యలు':మంగళగిరిలో డైయింగ్ షెడ్‌ను పరిశీలించిన బ్రహ్మణి

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  నారా బ్రహ్మణి ఇవాళ పర్యటించారు.చేనేత కార్మికులతో  నారా బ్రహ్మణి మాట్లాడారు.

Nara Brahmani Visit  weavers  in Mangalagiri Assembly Segment lns

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి  అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆత్మకూరులో  డైయింగ్  షెడ్ ను మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి శనివారం నాడు సందర్శించారు. చేనేత కార్మికులతో మాట్లాడారు.  చేనేత వస్త్రాల తయారీ గురించి ఆమె  కార్మికులతో మాట్లాడారు.చేనేత డైయింగ్ గురించి  కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్రహ్మణి. ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు రాలేదని  చేనేత కార్మికులు బ్రహ్మణి దృష్టికి తెచ్చారు. కష్టం ఎక్కువగా ఉన్నాఆదాయం మాత్రం ఆ మేరకు లేదని చేనేత కార్మికులు  బ్రహ్మణి దృష్టికి తెచ్చారు.

also read:టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

నూలుకి రంగులు అద్దె ప్రక్రియ ఎంతో కష్టం తో కూడుకున్నదని  చేనేత కార్మికులు చెప్పారు. అయినా తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురౌతున్నాయని  చేనేత కార్మికులు చెప్పారు. 

వర్షా కాలంలో పని ఎక్కువగా ఉంటుందన్నారు.కానీ ఆదాయం తక్కువ ఉంటుందని చేనేత కార్మికులు చెప్పారు.  చేనేత కార్మికులు మగ్గాలపై  చీరల తయారీని  ఆమె పరిశీలించారు.  చీరల తయారీ ప్రక్రియ గురించి బ్రహ్మణి తెలుసుకున్నారు.

also read:కారు వాటర్ వాష్ చేస్తున్న యువతిపై బాటిల్‌తో దాడి: కౌంటరిచ్చిన బాధితురాలు వీడియో వైరల్

రానున్న ఎన్నికల్లో  మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి  నారా లోకేష్ మరోసారి  పోటీ చేయనున్నారు.  2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి  లోకేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుండి పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించారు. ఇటీవల కాలంలో  మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  పర్యటించారు.  మంగళగిరి  అసెంబ్లీ నియోజకవర్గంలో చేనేత కార్మికులు  ఎక్కువగా ఉంటారు.ఆయా పార్టీల గెలుపు ఓటములను చేనేత కార్మికులు ప్రభావం చేస్తారు.

also read:ఇనుప కడ్డీల మధ్య చిక్కుకున్న హంస: కాపాడిన వ్యక్తి వీడియో వైరల్

మంగళగిరి నియోజకవర్గంలో  ఇవాళ బ్రహ్మణి పర్యటించి  చేనేత కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  వైఎస్ఆర్‌సీపీ  చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. అయితే  గంజి చిరంజీవి స్థానంలో మహిళను  రానున్న ఎన్నికల్లో బరిలోకి దింపాలని  వైఎస్ఆర్‌సీపీ భావిస్తుంది. ఈ దిశగా  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం  కసరత్తు చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios