బాహుబలికి చంద్రబాబు క్రేజ్ పెంచారట: అలాగే మహానటికి సైతం

Nannapeneni says Bahubali craze increased with Chnadrababu comments
Highlights

బాహుబలి సినిమా గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.

అమరావతి: బాహుబలి సినిమా గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. చంద్రబాబు సినిమాల గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించరని, సినిమాలు చూసే తీరిక కూడా ఆయనకు ఉండదని ఆమె అన్నారు. 

మహానటి సినిమా యూనిట్ ను శనివారం చంద్రబాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదో పెద్ద క్రేజ్ అయిందని నన్నపనేని అన్నారు. అలాగే మహానటి గురించి ఇటీవల పార్టీ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో  చంద్రబాబు మాట్లాడినప్పుడు ఆ సినిమాకు వెళ్లి చూడాలని అనిపించిందని ఆమె అన్నారు. 

చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు అంతకుముందు చూడనివాళ్లు కూడా ఈ సినిమాను చూసిన సందర్బం ఉందని ఆమె అన్నారు. సావిత్రిగారు మళ్లీ పుట్టారని, అందుకే ఆ సినిమా చూడాలనిపించిందని నన్నపనేని అన్నారు. 

సావిత్రి మళ్లీ జన్మించడానికి అశ్వినీదత్ కూతురు, అల్లుడు కారణమని ఆమె అన్నారు. దీనికి సావిత్రి కుమార్తె చాముండేశ్వరీ కూడా సహకరించారని అన్నారు. ఈ సినిమాకు ఎక్కువ మంది మహిళలే పనిచేయడం విశేషమని ఆమె అన్నారు. 

loader