వైసీపి గెలవడం అసాధ్యం టీడీపినే గెలుస్తుందన్నా జేసీ 2019 లో కూడా బిజేపితో దోస్తీ

ప్ర‌భుత్వం పై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంది, అయినా నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నంద్యాల ప్రచారంలో పాల్గోన్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు.

నంద్యా ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంద‌ని ఎంపీ జేసి ధీమా వ్య‌క్తం చేశారు. కానీ వైసీపికి, టిడీపీకి మ‌ధ్య చాలా త‌క్కువ‌ మెజారిటీ ఫ‌లితం వ‌స్తుంద‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల‌కు కొంత వ్య‌త‌రిరేకత‌ ఉంద‌ని దీనికి కార‌ణం ప్ర‌భుత్వం అభివృద్ధి పనులు స‌రిగ్గా చేయడం లేదని ఎంపీ పేర్కొన్నారు.

వైసీపి పార్టీ పై జేసీ ధ్య‌జ‌మేత్తారు. జగన్ సభ తర్వాత వైసీపీ గబ్బు పట్టిందని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ నిజ‌స్వరూపం ఆ పార్టీ స‌భ్యుల‌కు తెలియ‌ద‌ని, ఆయ‌న అధికారం కోసం ఎవ‌రు త‌న పార్టీలోకి వ‌చ్చిన క‌లుపుకొని పొతార‌ని అన్నారు. మేము ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌రువాత కొంత వ్య‌తిరేక‌త వచ్చింద‌ని, అదే వైసీపికి ప్ర‌తిప‌క్షంలో ఉండి ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వైసీపి 2019 ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అని పెర్కోన్నారు. అదేవిధంగా బీజేపీ జగన్‌తో కలవదని ఆయ‌న తెలిపారు మోదీకి కొన్ని విలువలున్నాయని ఆయన అన్నారు. 2019లో టీడీపీ-బీజేపీ కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని ఎంపీ జేసీ వెల్లడించారు.