Asianet News TeluguAsianet News Telugu

శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి గుడ్ బై...?

నంద్యాల అసెంబ్లీ సీటు భూమా కుటుంబానిదే  అని ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు.

గత సారి పార్టీ అభ్యర్థిగా ఓడిపోయి నష్టపోయిన శిల్పామోహన్ రెడ్డి టిడిపి కి గుడ్ బై చెబుతారని అనుకుంటున్నారు.

ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేసి టిడిపి అభ్యర్థిని ఓడించేందుకు నిర్ణయం.గెలవకపోతే నంద్యాలలో అడ్రసు ఉండదు. 

Nandyala TDP strongman may call it quits

తెలుగు దేశం నంద్యాల ప్రముఖ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి  పార్టీకి గుడ్ చెబుతున్నట్టే నని ఆయన మిత్రులు చెబుతున్నారు. నిన్న ఆయన అమరావతిల్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశమయి వచ్చాక, ఇక పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లే నని ఆయన సన్నిహితుడొకరు ‘ఏషియానెట్’ కు చెప్పారు

.

నంద్యాల అసెంబ్లీ సీటును భూమా కుటుంబానికి ఇచ్చేశామని నిన్నటి సమావేశంలో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగాచెప్పారట. అంతేకాదు, ఇది పార్టీ నిర్ణయం, నీ ఇష్టం అని కూడా అన్నట్లు సమాచారం.శిల్పా సన్నిహితులు చెప్పిందాని ప్రకారం,  2019లో శిల్పాకు టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారట. దీనికి శిల్ప సమ్మతించలేదు. ఈ సీటు న్యాయంగా తనకు రావాలని, తాను గత ఎన్నికలలో ఇక్కడినుంచే పోటీ చేసిఓడిపోయి బాగా నష్టపోయానని కూడా ఆయన వాదించారు.

 

ముఖ్యమంత్రి ఈ వాదనతో ఏకభవించకుండా ఆ సీటు భూమాకుంటుంబానికే టికెట్టని నొక్కిచెప్పాడు.

 

‘ చనిపోయిన శాసన సభ్యుడి కుటుంబానికి చెందిన వారికి టికెట్ ఇవ్వడం సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారమే భూమాకుటుంబానికి  ఈ సారిటికెట్ ఇస్తున్నాం. నీకు కావలంటే, 2019లో ఇస్తాం,’ అని ముఖ్యమంత్రి  వాదించడం శిల్పాను ఆశ్చర్యపరింది.

 

 ఈ నియోజకవర్గం తనకెందుకు దక్కాలో భూమా కుటుంబానికి ఎందుకు హక్కు లేదో శిల్పా వివరించే ప్రయత్నం చేశాడు. వినే  స్థితిలో బాస్ లేరు.

 

‘ ఇదే మీ నిర్ణయం అయితే, నేను ఇండిపెండెంటుగా పోటీ చేసి, గెల్చి మీ దగ్గిరకు వస్తాను,’ అని శిల్పా అనడం టిడిపి అధినేతకు ఆగ్రహం తెపించింది. ఇక నువ్వు వెళ్లవచ్చు, అని చంద్రబాబు అన్నట్లుసన్నిహితుల కథనం.

 

 ఈ వివాదం శిల్పా మోహన్ రెడ్డి, ఎంఎల్ సి చక్రపాణి  ల మధ్య వివాదానికి దారితీసిందని తెలిపింద.  ఈ సమావేశంలో చక్రపాణి రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

 

ఉప ఎన్నికలలో గెలిపిస్తే, చక్రపాణి రెడ్డి ని రిటైరవుతున్న చక్రపాణి స్థానంలో కౌన్సిల్ ఛెయిర్మన్ నియమిస్తానని  చంద్రబాబు మాట ఇచ్చినట్లు  శిల్పా వర్గాలు చెబుతున్నాయి.

 

‘ ముఖ్యమంత్రి నన్ను కౌన్సిల్ ఛెయిర్మ చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఈ ఎన్నికల్లో పార్టీ  నిర్ణయం ప్రకార పనిచేద్దాం,’ అని చక్రపాణి సలహాఇచ్చారు.

 

 ఈ సలహా శిల్పాకు నచ్చలేదు. అందువల్ల అన్నదమ్ముల్లిద్దరు ఇక విడిపోయినట్లే నని, ఈ విషయంలో తెలుగుదేశం నేత తెలివిగా వ్యవహరించారని ఈ వర్గం భావిస్తున్నది.

 

శిల్పా మోహన్ రెడ్డి అనుచరులతోసమావేశమయి రాజకీయ భవిష్యత్తు పై తుది నిర్ణయం తీసుకుంటారని కూడా వారు చెప్పారు.

 

 శిల్పా ముందున్న మార్గాలు మూడు:

 1. తనకు టికెట్ ఇవ్వకపోయినా, పార్టీని అంటిపెంటుకుని 2019 దాకా  ఎదురుచూడటం

2. పార్టీ నుంచి బయపటపడి ఇండిపెండెంటుగా పోటీచేసి గెల్చి సత్తా నిరూపించడం

3. వైసిపిలోకి ఉడాయించడం...

ఏ మవుతుందో ఒక వారం రోజుల్లో తేలవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios