సెప్టెంబరు 12 లోగా ఎన్నిక పూర్తి నోటిఫికేషన్‌ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ప్రకటన 


నంద్యాల అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. సెప్టెంబరు 12 లోగా ఎన్నిక పూర్తవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఇప్పటికే ఉపఎన్నిలకు ప్రధాన పార్టీలన్ని సిద్దంకాగా, నోటిఫికేషన్‌ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటనతో మరింత అలెర్ట్ అయ్యాయి.ఆయన అధికారులను సిద్దంగా ఉండాలని చేసిన ప్రకటనతో వారు అప్రమత్తమవగా, వీరికంటే ముందే రాజకీయ పార్టీలు సిద్దమయ్యారు.
నంద్యాల ఉప ఎన్నికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులతో స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు ఎన్నికల బందోబస్తు, నిర్వహణ,సదుపాయాలు తదితర అంశాలపై ఆయన అధికారుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.
 ఓటరు నమోదులో జరిగిన అవకతవకలను నివారించడంలో స్థానిక యంత్రాంగం విఫలమయ్యారని, వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల్లో పాల్గొనే పార్టీలన్ని అదికారులకు సహకరించాలని రాజకీయ వర్గాలకు కూడా ఆయన సూచనలు చేసారు. నిస్పక్షపాతంగా అధికారులు విధులు నిర్వహించాలని, ఏ పార్టీకి కొమ్ముకాయొద్దని పిలుపునిచ్చారు. ఓటర్లను మభ్యపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
 కేం ద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ జిల్లా అంతటా వర్తిస్తుందని, అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు సరిహద్దు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ అధికారు లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో గంగాధర్‌గౌడు, కర్నూలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ మహేష్‌ కుమార్‌, నంద్యాల ఇన్‌చార్జి ఈఎస్‌ రాణి తదితరులు పాల్గొన్నారు.