రోజా ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు 16 వార్డు మహిళలకు రోజాకు మధ్య ఘర్షణ. వెనుదిరిగిన రోజా

వైసీపి ఎమ్మెల్యే రోజాకు నంద్యాల చుక్కెదురైంది. నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి గ‌త వారం రోజుల నుండి పాల్గోంటున్నారు. ప్ర‌తి వార్డు వార్డుకు తిరిగి వైకాపా ఎమ్మెల్యే ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త రెండు రోజుల నుండి త‌న ప్ర‌చారం మ‌రింత‌ వేగవంతం చేశారు.

అయితే రోజాకు ప్ర‌చారంలో చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారానికి వెళ్లగా స్థానిక మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్క‌డి మ‌హిళ‌లు ఆమెను త‌మ ప్రాంతంలో రానివ్వ‌కూడ‌ని హుకుం జారీ చేశారు. దీంతో వైకాపా, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య చిన్న‌ తోపులాట చోటుచేసుకుంది.


రోజా కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఉందుకు వ‌ద్దు అంటున్నారో కార‌ణాలు అడ‌గ‌టానికి ప్ర‌య‌త్నించారు. ఐరెన్ లెగ్ రోజా తమ వార్డులో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ వార్డు ప్రజలు భీష్మించికూర్చొన్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. 16 వార్డులో ప్ర‌చారం కోసం వెళ్లిన రోజాను ప్ర‌చారానికి రానివక‌పోవ‌డం వెనుక టిడిపి శ్రేణులు హాస్తం ఉంద‌ని రోజా మీడియాతో అన్నారు.