వాళ్లకు మనుషులు అంటేనే ఎలర్జీ.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: బాలకృష్ణ

బాలకృష్ణ మంగళవారం టీడీపీ కేంద్ర  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు అంటేనే అభివృద్దికి, సంక్షేమానికి ఒక బ్రాండ్ అని తెలిపారు. చంద్రబాబు గురించి ప్రపంచ దేశాలు అన్ని చెప్పుకుంటాయని అన్నారు.

Nandamuri Balakrishna Sensational Comments YS Jagan Govt over Chandrababu Naidu Arrest ksm

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ సర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై బాలకృష్ణ మంగళవారం టీడీపీ కేంద్ర  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు అంటేనే అభివృద్దికి, సంక్షేమానికి ఒక బ్రాండ్ అని తెలిపారు. చంద్రబాబు గురించి ప్రపంచ దేశాలు అన్ని చెప్పుకుంటాయని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని బాలకృష్ణ మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయిన  కుట్ర పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని.. 16 రోజులైన చంద్రబాబును జైలులో పెట్టాలని ఈ స్కామ్‌ను క్రియేట్ చేశారని ఆరోపించారు. అయితే ఈ కేసులో ప్రేమ్‌చంద్రా రెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.

పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకోచ్చారు. గుజరాత్‌లో చూసే ఈ స్కీమ్‌ను ఏపీలో తీసుకొచ్చారని అన్నారు. 72 వేల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. సీఎం అనే వ్యక్తి పాలసీ మేకర్ మాత్రమేనని అన్నారు. ఇక ముందు ముందు చాలా కేసులు పెడతారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా డిజైన్ టెక్ కంపెనీకి అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిందని చెప్పారు. 

వైసీపీ నేతలు అభివృద్ది అంటే ఓర్వలేని వ్యక్తులని విమర్శించారు. ‘‘వాళ్లకు మనుషులు అంటేనే ఎలర్జీ అని  చెప్పాను. ఏదో పైపైకి ముదరష్టపు మూతి వేసుకుని.. తిన్న వేళ్లకు అంటుకున్న ఎంగిలి మేతుకులు వేసినట్టు వేస్తున్నారు. రూ. 10 వేసి రూ. 100 నొక్కేస్తున్నారు. ఇక ముందు  కూడా చాలా వేస్తారు’’ అని  బాలకృష్ణ చెప్పారు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు అప్పుడు మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి.. రూ. 16 వేల కోట్లతో సంస్థలు తెవడం జరిగిందని, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని సమాధానం చెప్పారు. హిందూపురంలో పార్క్ పెట్టనున్నట్టుగా గౌతమ్ రెడ్డి పీఏ  ఫోన్ చేశారని.. తనను రావాలని కోరారని.. అప్పుడు జరగని వాటికి ఎందుకని తాను ప్రశ్నించానని తెలిపారు. 

ఒకసారి మాట ఇస్తే.. మాట తప్పని పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తాము జవాబుదారీతనంగా వ్యవహరించామని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్లు కాలయాపాన చేశారని మండిపడ్డారు. నవరత్నాలు అని 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని.. ఆ అప్పు ఎవరూ తీర్చాలని ప్రశ్నించారు. ఈ భారం ప్రజల మీదే పడుతుందని అన్నారు. 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటివి ఎన్నో చూసిందని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios