Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలోని తేల్చుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని చెప్పారు.

nandamuri balakrishna Comments Before Ap Assembly Session over chandrababu Arrest ksm
Author
First Published Sep 21, 2023, 10:25 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలోని తేల్చుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని చెప్పారు. ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వెంకటపాలెంలో ఎన్ఠీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలోనే అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. అలాగే టీడీపీ సభ్యులతో కలిసి సభకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని అన్నారు. తమ పార్టీ ప్రజల్లో ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పారు. 

Also Read: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. దమ్ముంటే రా అంటూ అంబటి కౌంటర్.. తొడగొట్టిన బియ్యం మధుసూదన్

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై గళమెత్తటమే తమ ప్రధాన అజెండా అని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఇక, చంద్రబాబుపై కక్ష-యువత భవితకు శిక్ష అంటూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. షెల్ కంపెనీల సృష్టికర్త జగన్ రెడ్డి అని రాసి ఉన్న ఫ్లకార్డును ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రదర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios