అరెస్టు వారెంటు జారీ

First Published 5, Dec 2017, 11:31 AM IST
Nampalli court issues non bailable arrest warrant to abn md radhakrishna
Highlights
  • ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మహన్ రెడ్డి పరువు నష్టంకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా రాధాకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, తనను వ్యక్తిగత హాజరునుండి మినహాయించాలంటూ రాధాకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. అయితే, మినహాయింపు కుదరదని, కేసు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ సోమవారం హై కోర్టు కేసు కొట్టేసింది. దాంతో మంగళవారం కేసు విచారణకు రాధాకృష్ణ హాజరుకావాల్సుంది. కానీ కోర్టు చెప్పినా ఎండి నాంపల్లి కోర్టుకు హాజరుకాలేదు. దాంతో రాధాకృష్ణ చర్యలు కోర్టు ధిక్కారంగా భావించిన న్యాయస్ధానం రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది.

loader