వెలగపూడి గ్రామంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు మాత్రం నిర్దిష్టంగా కనబడతున్న అభివృద్ధి అని చెప్పవచ్చు.

మూడేళ్ళ చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఏమిటి? అని అడిగే వాళ్ళకు ఇదే సమాధానం. ఇదొక్కటే సమాధానం కూడా. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కార్ వెలగపూడి గ్రామంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు మాత్రం నిర్దిష్టంగా కనబడతున్న అభివృద్ధి అని చెప్పవచ్చు. అది కూడా సదరు నిర్మాణాలపై అనేకమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాస్తవం మాత్రం అదే. చంద్రబాబు పెద్ద బృందంతో స్వయంగా ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి, ఉన్నతాధికారులను దేశ దేశదేశాలకు పంపించి, పలు దేశాలకు చెందిన ఆర్కిటెక్టులను పిలిపించినా తర్వాత కళ్ళకు కనబడుతున్న అభివృద్ధి ఇదే. తాత్కాలికానికే మూడేళ్ళు కష్టపడితే ఇక శాశ్వతానికి ఇంకెన్ని సంవత్సరాలు అవస్తలు పడాలో.....