Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు షాకిచ్చిన జనాలు

  • అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రజల్లో అసలు ఆశక్తి ఉందా అన్న అనుమానాలు మొదలైంది.
Naidus public opinion for New Assembly design elicits poor response

అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రజల్లో అసలు ఆశక్తి ఉందా అన్న అనుమానాలు మొదలైంది. గడచిన రెండేళ్ళుగా అమరావతి నిర్మాణం గురించి చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్న విషయం తెలిసిందే.  చంద్రబాబు చెప్పుకోవటమే కానీ జనాల్లో పెద్దగా ఆశక్తి ఉన్నట్లు కనబడటం లేదు. తాజాగా వచ్చిన ఫీడ్ బ్యాక్ నిజంగా చంద్రబాబుకు షాకిచ్చినట్లే.  

ఇంతకీ విషయం ఏంటంటే, రాజధాని నిర్మాణాలకు బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ డిజైన్లు రూపొందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మిగిలిన నిర్మాణాల సంగతి ఎలాగున్నా ఈమధ్యనే అసెంబ్లీ నిర్మాణం కోసం రెండు డిజైన్లను అందించారు. దాన్ని ముఖ్యమంత్రి ఆమోదించారు. తర్వాత జనాల అభిప్రాయాల కోసం  సిఆర్డీఏ వెబ్ సైట్లో రెండు డిజైన్లను ఉంచారు.

సరే, సిఆర్డీఏ కూడా డిజైన్లను సుమారు 2 వారాల పాటు జనాలకు అందుబాటులో ఉంచింది. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో జనాలనుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ పై చర్చించి వివరాలను మీడియాకు విడుదల చేసారు. మున్సిపల్ మంత్రి నారాయణ విడుదల చేసిన వివరాలు చూసి  అందరూ షాకయ్యారు.

ఎందుకంటే, మంత్రి చెప్పిన ప్రకారం ఆన్ లైన్లో 25, 060  మంది అభిప్రాయాలు చెప్పారు. అందులో 7,120 మంది డైమెండ్ ఆకారంలో ఉన్న డిజైన్ బాగుందన్నారు. మిగిలిన 17, 940 మంది టవర్ ఆకారంలోని డిజైన్ వైపే మొగ్గుచూపారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే, ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవేంటంటే, రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు. అందులో చదువుకున్న వారిసంఖ్య ఎంత తక్కవేసుకున్నా 2 కోట్లుంటుంది. మళ్ళీ వీరిలో ఉద్యోగుల సంఖ్య సుమారు 25 లక్షలకు తగ్గదు. ఇందులో కూడా ప్రభుత్వ ఉద్యోగులే సుమారు 5 లక్షలమంది. విశ్రాంత ఉద్యోగులు మరో 7 లక్షలుంటారు. విద్యావంతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఖ్య కోట్లలో ఉండగా డిజైన్లపై అభిప్రాయాలు చెప్పింది కేవలం 25 వేలమందేనా ?

ఇక్కడే అనుమానాలు కలుగుతున్నాయి. 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 25 వేలమంది మాత్రమే అభిప్రాయ సేకరణలో పాల్గొనటమేంటి? ఇది దేనికి సంకేతం? స్ధూలంగా చూస్తే రెండు అనుమానాలు వస్తున్నాయ్. ఒకటి, డిజైన్లపై అభిప్రాయాలు చెప్పటంలో సిఆర్డీఏనే అందరికీ యాక్సిస్ ఇవ్వలేదా? లేకపోతే రాజధాని నిర్మాణంపై జనాల్లోనే ఆశక్తి లేదా? చూడబోతే రెండూ వాస్తవాలే అన్న అనుమానాలు కలుగుతోంది. 5 కోట్లమంది జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 17 వేలమంది చెప్పిన అభిప్రాయాన్నిచంద్రబాబు ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు?

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios