ఏకమవుతున్న చంద్రబాబు శతృవులు (వీడియో)

ఏకమవుతున్న చంద్రబాబు శతృవులు (వీడియో)

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడికి శతృవులు పెరిగిపోతున్నారు. ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒడిస్సా, తెలంగాణా ప్రభుత్వాలు తాజాగా చేతులు కలిపాయి. ఒకవైపు కేంద్రం సహాయనిరాకరణ, ఇంకోవైపు ఒడిస్సా, తెలంగాణాలు ఏకమవ్వటం, ఏపిలో ప్రతిపక్షాల ఆరోపణలు కాకుండా స్వీయ తప్పిదాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దాంతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిస్ధితులను గమనిస్తుంటే అసలు పోలవరం నిర్మాణం చంద్రబాబు వల్ల అవుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

దానికి తగ్గట్లే, చంద్రబాబు కూడా పోలవరం విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారు. 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు. మరోసారి మాట్లాడుతూ, 2019లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ విషయాలన్నింటినీ పక్కనపెడితే మరో ఐదేళ్ళయినా ప్రాజెక్టు పూర్తికాదంటూ టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి చాలా సార్లే బహిరంగంగా ప్రకటించటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కానీ అత్యుత్సాహంతో కేంద్ర ప్రాజెక్టును చంద్రబాబే బలవంతంగా తన చేతుల్లోకి లాక్కున్నారు. దాంతో అప్పటి నుండి ప్రాజెక్టు విషయంలో కేంద్రం సీతకన్ను వేసింది.

దానికి తగ్గట్లే కేంద్రం విడుదల చేసిన నిధలకు చంద్రబాబు కూడా లెక్కలు చెప్పటం లేదట. దాంతో విడుదల చేసిన నిధులకు లెక్కలు చెబితేనే మళ్ళీ నిధుల విడుదల చేస్తామని కేంద్రం గట్టిగా హెచ్చరించిందట. దాంతో చంద్రాబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదే సమయంలో కాంట్రాక్టర్ మార్పుకు కేంద్రం అంగీకరించకపోవటం, అంచనాల పెంపును అంగీకరించకపోవటం లాంటి అనేక విషయాలతో చంద్రబాబులో ఆందోళన పెరిగిపోయింది. దాంతో అందరికీ అర్ధమైపోయింది ఇప్పట్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని.

ఇదిలావుండగానే పోలవరం నిర్మాణాలకు వ్యతిరేకంగా ఒడిస్సా ప్రభుత్వం కేంద్రానికి ఈమధ్యే ఓ లేఖ రాసింది. దానికి మద్దతుగా తెలంగాణా ప్రభుత్వం కూడా ఒడిస్సా ప్రభుత్వానికి మద్దతు పలకటం ఏపి ప్రభుత్వం నెత్తిన బండ పడేయటమే. ఎందుకంటే, తెలంగాణా రాష్ట్రం ఇస్తే చాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించారు.

 

అందులో భాగంగానే తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలను కూడా ఏపికి బదలాయించటానికి అంగీకరించింది వాస్తవం. కాకపోతే చంద్రబాబు పరిస్ధితి బలహీనమవ్వటంతో కెసిఆర్ కూడా తనవంతుగా ఓ బండ విసురుతుండటమే  విచిత్రం.  

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos