ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పూర్తి స్థాయి ఆంధ్రా పౌరుడు కోబోతున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాబోతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఆయన ఇంకా హైదరాబాద్ ఓటరే. ఆయన శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఇపుడాయన తన ఓటును ఆంధప్రదేశ్ మార్చాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వార్తలొస్తున్నాయి.
ఇతర శాసనసభ్యులకు ఆయనకు తేడా ఇదే. చాలా మంది శాసనసభ్యులకు వారి వారి నియోజకవర్గాలలోనే ఓట్లున్నాయి. ఒక్కముఖ్యమంత్రికి మాత్రమేహైదరాబాద్ లో ఓటు ఉంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నందున హైదరాబాద్ పౌరుడిగానే కొనసాగుతూ వచ్చారు. ఇపుడు తప్పని సరిగా ఆంధ్ర పౌరుడయి తీరాలి.
ఇటీవలే ప్రభుత్వాన్ని అమరావతికి మార్చేశారు. అయితే, ఆయన నివాసం మాత్రం ఇంకా హైదరాబాద్ లో కొనసాగుతూ ఉంది. ఆయన అడ్రసు హైదరాబాద్ లో ఉన్నా, సెక్షన్ 19 , ఆర్ పి యాక్ట్ ప్రకారం సర్వీస్ రీత్యా అమరావతి లో ఉంటున్నందున ఆయన ఆంధ్రప్రదేశ్ ఓటరుగా నమోదుచేసుకోవచ్చని కమిషన్ వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నందున ఆ ప్రాంతంనుంచే ఆయన ఓటరుగా నమోదుకానున్నారు.
