ఇబ్రహింపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాద స్ధలానికి చంద్రబాబునాయుడు, అఖిలప్రియ చేరుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వివరాలు తెలుసుకొని, సంఘటన గురించి తెలియగానే స్పందించిన సైదులు, నడికుదురు పిచ్చయ్య, శివయ్యలతో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను, బోటు నిర్వాహకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకపోయినా బోటు తిరుగుతుంటే  చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. మృతుల వివరాలు, చికిత్స తీసుకుంటున్న వారి వివరాలతో పాటు గల్లంతైన వారికోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీసారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే చంద్రబాబు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాగా బోటు నిర్వాహకుడు శేషగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా టిడిపి నేతల ఒత్తిడి వల్ల నదిలో సుమారు 30 బోట్లు తిరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.