చంద్రబాబునాయుడు ఫుల్లుగా క్లాస్ పీకారు. ఎవరికి? ఇంకెవరికి టిడిపి నేతలకే.

చంద్రబాబునాయుడు ఫుల్లుగా క్లాస్ పీకారు. ఎవరికి? ఇంకెవరికి టిడిపి నేతలకే. అసలేం జరిగిందంటే, ‘ఇంటింటికి తెలుగుదేశం’ అన్నది చంద్రబాబు ప్రారంభించిన ప్రతిష్టాత్మక పార్టీ కార్యక్రమం. అటువంటి కార్యక్రమం నిర్వహణలో తమ్ముళ్ళలో చాలామంది నాన్ సీరియస్ గా ఉన్నారట. అందుకనే చంద్రబాబుకు ఒళ్ళు మండిది.

దాంతో బుధవారం జరిగిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో మండిపడ్డారు. కార్యక్రమాల్లో ఎంఎల్ఏలు సరిగా హాజరుకావటం లేదట. ఎంఎల్ఏలు హాజరుకాకపోవటంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమం కూడా ఏదో మొక్కుబడిగా జరుగుతోంది. ఆ విషయాలను ప్రస్తావించే సిఎం పలువురు నేతలపై ధ్వజమెత్తారు.

రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిధిలో కూడా కార్యక్రమం సరిగా జరగటం లేదని నివేదిక చదవి వినిపించారు. పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతున్న విధానంపై సిఎం పూర్తిగా అసహనం వ్యక్తం చేసారట. పై నియోజకవర్గాలకు ‘సి’ గ్రేడ్ ఇచ్చారు.

అదే విధంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో నేతలు కార్యక్రమ నిర్వహణ పట్ల సీరియస్ గా లేరు కాబట్టే వాటికి కూడా సి గ్రేడే వచ్చిందని లోకేష్ వివరించారట. దాంతో కార్యక్రమంలో పాల్గొనని నేతల జాబితాను చంద్రబాబు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నేతలను గాడిలో పెట్టే బాధ్యతను యనమల రామకృష్ణుడికి అప్పగించారు.

సరే, గండికోట ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అంటూ హూంకరించారు. పనిలో పనిగా జగన్ పాదయాత్ర గురించి కూడా చర్చ జరిగిందట. పాదయాత్రను అడ్డుకోవాలని సూచించారట. ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ, ‘వారి రాజీనామాల అంశం కోర్టులో ఉందికాబట్టి మనం మాట్లాడేది ఏమీ లేద’ని సమాధానం చెప్పండి అంటూ తెలిపారట.