మొత్తానికి కెసిఆర్ అనంతపురం పర్యటన టిడిపిలో బాగానే కలకలం రేపింది. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు ఈనెల 1వ తేదీన కెసిఆర్ అనంతపురంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కెసిఆర్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నాటకీయ పరిణామాలు చాలానే జరిగాయి. పయ్యావులను తీసుకుని విడిగా దాదాపు పావుగంట మాట్లాడారు.

మొత్తానికి కెసిఆర్ అనంతపురం పర్యటన టిడిపిలో బాగానే కలకలం రేపింది. పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు ఈనెల 1వ తేదీన కెసిఆర్ అనంతపురంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కెసిఆర్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నాటకీయ పరిణామాలు చాలానే జరిగాయి. కెసిఆర్ అనంతపురంలో దిగిన దగ్గర నుండి పలువురు టిడిపి నేతలు బ్రహ్మరధం పట్టారు. తెలంగాణా సిఎంను కలవటానికి ఒకవిధంగా టిడిపి నేతలు పోటీలు పడ్డారు. కరచాలనాలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. నిజంగా చెప్పాలంటే కెసిఆర్ కు తెలంగాణాలో కూడా అంతటి ఘనస్వాగతం లభించదేమో అనిపించింది.

ముందేమో తెలంగాణా సిఎం వస్తుంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారే అని అనుకున్నారు. కానీ కెసిఆర్ విమానం దిగగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తెలంగాణా సిఎం వచ్చిన దగ్గర నుండి చంద్రబాబును అక్కడెవరూ పట్టించుకోలేదు. దానికి తోడు ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ గురించి కెసిఆర్ ప్రత్యేకంగా వాకాబు చేయటం పలువురిని ఆశ్చర్యపరిచింది.

అంతేకాకుండా పయ్యావులను తీసుకుని విడిగా దాదాపు పావుగంట మాట్లాడారు. హైదరాబాద్ నుండి తనవెంట వచ్చిన వారిని కూడా కెసిఆర్ దూరంగానే ఉంచి మరీ పయ్యావులతో మాట్లాడటం టిడిపిలో కలకలం రేపింది. వారిద్దరి మధ్య జరిగిన చర్చల సారంసం బయటకు పొక్కలేదు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేయమని కెసిఆర్ ఆఫర్ ఇచ్చారనేది ఒక ప్రచారం.

సరే, చర్చలపై ఎవరికి వారుగా ఊహించుకుంటున్నా పయ్యావుల కూడా చర్చల సారాంశాన్ని ఎవరితోనూ షేర్ చేసుకున్నట్లు కనబడలేదు. చంద్రబాబును కలసి చర్చల అంశాన్ని ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. దాని పలితం మంగళవారం టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో కనబడింది. కెసిఆర్ అనంతపురం పర్యటనపై మాట్లాడుతూ, ‘మనవాళ్ళు తొందరపడి ప్రవర్తించార’ని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కెసిఆర్-కేశవ్ రహస్య మంతనాలతో పార్టీలో గందరగోళం మొదలైందని అసహనం వ్యక్తం చేసారు. ఇటువంటివి పార్టీకి ఏ మేరకు అవసరమో అందరూ ఆలోచించాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే కెసిఆర్ –కేశవ్ ల మంతనాలు టిడిపిలో బాగానే చిచ్చు రగిల్చినట్లుంది.