పట్టిసీమలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)స్పష్టంగా చెప్పింది. ఇక, నేతల ధౌర్జన్యాలకు, దాడులకు అంతేలేదు. నీతి, నిజాయితీగా ఉండాలని చెబుతూంటేనే ఇన్ని ఆరోపణలున్నాయి. ఇక, బాగా సంపాదించుకోండి అని అంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోరా?
‘బాగా సంపాదించుకోండి..కొంత పార్టీకి విరాళమివ్వండి’...ఇది చంద్రబాబునాయుడు తాజాగా చెప్పిన మాటలు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడులో ఆదివారం మాట్లాడుతూ బాగా సంపాదించుకుని, పార్టీకి విరాళమివ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇక్కడే కొన్ని సందేహాలు మొదలయ్యాయి.
బాగా సంపాదించుకోవాలంటే మార్గాలేమిటి? పార్టీ నేతలు ఎలా సంపాదించుకుంటున్నారు కదా? బాగా సంపాదించుకోమని కొత్తగా చెప్పటమేంటి? ఒకవైపు నీతి, నిజాయితీల గురించి చెబుతూ ఇంకోవైపు బాగా సంపాదించుకొండి అంటే, ఇప్పడు సంపాదించుకుంటున్నది సరిపోవటం లేదనేనా?
ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలపై అనేక అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. పోలవరం, రాజధాని, పట్టిసీమ, ఇసుక అక్రమ రవాణా..ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ అవినీతిదే అగ్రస్ధానమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయ్.
పట్టిసీమలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)స్పష్టంగా చెప్పింది. ఇక, నేతల ధౌర్జన్యాలకు, దాడులకు అంతేలేదు. నీతి, నిజాయితీగా ఉండాలని చెబుతూంటేనే ఇన్ని ఆరోపణలున్నాయి. ఇక, బాగా సంపాదించుకోండి అని అంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోరా?
పార్టీలో ఇపుడదే విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. పైగా పార్టీ విరాళాలకు సంబంధించి కేంద్రం వచ్చేఏడాది కొత్త చట్టం తేబోతోంది కాబట్టి ఈలోగానే నగదురూపంలో విరాళాలను ఇవ్వమని చెప్పటం గమనార్హం. రెండు రోజుల్లో రూ. 4.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కూడా సిఎం చెప్పారు.
‘ఇపుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు? ప్రతీ ఒక్కరూ డబ్బు సంపాదించుకోండి, సంపద పెంచుకోండి’ అని అన్నారు. ‘అలా సంపాదించిన సొమ్మును ఇళ్ళల్లో పెట్టుకోకుండా దానదర్మాలు చేయాల’న్నారు. సరే విరాళాలడగటం బాగానే ఉంది. అందరినీ విరాళాలడుతున్న చంద్రబాబు తాను గానీ లేదా తన కుటుంబం గానీ విరాళం ఇస్తానని మాత్రం ఎందుకు చెప్పలేదు?
