Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 175 సీట్లు..

వచ్చే ఎన్నికల్లో 175 అయినా...225 అయినా అన్నీ స్ధానాలూ టిడిపినే గెలవాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎక్కడైనా ఫలితం రాలేదంటే అక్కడ నాయకత్వ లోపమేనట. అందుకే లోపాలు లేకుండా చూసుకుంటారని ముందుగానే హెచ్చరిస్తున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారు.

Naidu targets to win all the seats in the next election

సమయం లేదు మిత్రమా..పాపులర్ డైలాగ్ లాగే చంద్రబాబునాయుడు కూడా తన ఎంఎల్ఏలను హెచ్చరిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైనట్లు చెప్పారు. మంగళవారం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వేగం పెంచాలంటూ ఎంఎల్ఏలకు స్పష్టం చేసారు. వేగం పెంచాలి, ఇంకా ఎక్కువ శ్రమపడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అయినా...225 అయినా అన్నీ స్ధానాలూ టిడిపినే గెలవాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎక్కడైనా ఫలితం రాలేదంటే అక్కడ నాయకత్వ లోపమేనట. అందుకే లోపాలు లేకుండా చూసుకుంటారని ముందుగానే హెచ్చరిస్తున్నట్లు కూడా చంద్రబాబు చెప్పారు.

ఈనెల 22వ తేదీలోగా జిల్లా కమిటీలు సహా పార్టీ కమీటలన్నింటికీ ఎన్నికలు పూర్తి కావాలని ఆదేశించారు. నచ్చిన వారితో కాకుండా పనిమంతులనే నియమించాలని కూడా సూచించారు. ప్రతీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులపై ఐవిఆర్ఎస్ ద్వారా సర్వే జరిపిస్తారట. ప్రజామోదం లేని వారిని నిర్దాక్షణ్యంగా తొలగిస్తానని కూడా హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో ఎంఎల్ఏలు విఫలమవుతున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసారు. కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా శాసనసభ్యులు పర్యవేక్షించాలన్నారు.

దేశం మొత్తం మీద రైతు రుణమాఫీని అమలు చేసిన రాష్ట్రాలు మూడేనని అందులో ఏపి కూడా ఒకట. మొన్నటి వరకూ రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏపి ఒక్కటే అంటూ ఊదరగొట్టిన సంగతి మరచిపోయినట్లున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇంకా పథకం అమలు ఇంకా మొదలుకాలేదు లేండి. ఒకవైపు  రైతులు తమ రుణాలు మాఫీ కావటం లేదని గగ్గోలు పెడుతుంటే మొత్తం రుణాలను మాఫీ చేసేసినట్లు చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios