చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోవర్టులున్నారా? ఇపుడిదే చర్చ అమరావతిలో విస్తృతంగా చర్చల్లో నలుగుతోంది. కొందరు మంత్రులు, ఎంఎల్ఏల వైఖరిపై చంద్రబాబు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట.

ఎందుకంటే, తన ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు అఖిలపక్ష సమావేశాలకు కూడా జనసేన తరపున కనీసం ఇద్దరు ప్రతినిధులను కూడా రప్పించ లేకపోయారట మంత్రులు. అదే విషయమై పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల వద్ద చంద్రబాబు వాపోయారట కూడా.

తమ మంత్రుల్లో కొందరు రెగ్యలర్ గా పవన్ తో టచ్ లో ఉన్నారని చంద్రబాబు అన్నారట.  పతన్ తో మంత్రులు, ఎంఎల్ఏలు టచ్ లోనే ఉన్నా మన అవసరాలకు మాత్రం పవన్ రప్పించలేకపోతున్నారంటూ మండిపడ్డారట చంద్రబాబు.

ఆమధ్య జనసేన ఆవిర్భావ బహిరంగ సమావేశంలో పవన్ మాట్లాడుతూ, తనతో టిడిపికి చెందిన 40 మంది ఎంఎల్ఏలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతిని ప్రత్యేకించి లోకేష్ అవినీతికి సంబంధించి వివరాలు తనకు వారే ఇచ్చినట్లు పవన్ చేసిన ప్రకటన పెద్ద దుమారాన్నే రేపింది.

బహుశా ఆ విషయాన్నే చంద్రబాబు మనసులో ఉంచుకుని మంత్రుల్లో కొందరు పవన్ తో టచ్ లో ఉన్నట్లు చెప్పారేమో? శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా ఒక్క ప్రతిపక్షం కూడా హాజరుకాకపోవటం చంద్రబాబుకు పెద్ద షాకే.