Asianet News TeluguAsianet News Telugu

బాబు చాలా బిజీ...

నల్ల నోట్ల శేఖర్ రెడ్డి టిటిడి బోర్డులోకి ఎలా దూరాడో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా వివరణ ఇవ్వలేదు

naidu should explain sekhar Reddys ttd appoinment

బాబు చాలా బిజీ...

 

ఈ బడా నోట్ల శేఖర్ రెడ్డి ఏ రూట్ గుండా టిటిడిలోకి చొరబడ్డాడో ఏడుకొండలవాడి భక్తులకు ఇంకా తెలియాల్సి ఉంది.ఆయనను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా వివరణ ఇవ్వలేదు.  లేక వివరణ ఇచ్చేందుకు టైం దొరకడం లేదా.

 

టిటిడి బోర్డుమెంబర్ షిఫ్  కోసం శేఖర్ రెడ్డి సొంతంగా దరఖాస్తు చేసుకున్నారా, తెలిసిన వాళ్లు రికమెండ్ చేశారు, లేకపోతే, దేవుడేమయినా కలలో కనిపించిన తిరునామం పెట్టుకుని గొప్ప శ్రీ వైష్ణవుడిలాగా కనిపించే ఈ భక్తున్ని టిటిడి బోర్డు లోనియంచి నాకు సేవచేసే భాగ్యం కల్గించమని కోరాడా....

 

ఏదో ఒక విషయం తేలాల్సిన అవసరం  ఉంది.  టిటిడి బోర్డులో ఎపుడూ కోట్లకు పడగలెత్తిన వాళ్లే ఉంటారు. ఆర్డినరీ సిటిజన్లకు అర్హత ఉండదు.

naidu should explain sekhar Reddys ttd appoinment

ఇపుడు,  పేదోడికి రెండువేలు దొరకని రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో కొత్త నోట్లు కోట్లకు కోట్లు దొరికాయంటే ఎంతగా అవినీతికి పాల్పడ్డాడో చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యక్తిని పదవిలోనుంచి తీసేస్తే పాపం కడుక్కున్నట్లు కాదు. వివరణ కూడా ఇవ్వాలి.

మరీ బాబు చాలా బిజీ గా ఉన్నట్లున్నారు. ఇంకా వివరణ రాలేదు.

అందువల్ల మనమే వెళ్లి ‘ప్రశ్నిద్దాం’ అంటున్నాడు ఆంధ్రా పిసిసి అధ్యక్షుడు ఎన్  రఘవీరా రెడ్డి.

 

టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి అల్లాటప్పా మనిషి కాదు,  ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు బినామీ అని కూడా  రఘువీరారెడ్డి ఆరోపిస్తున్నారు. చెన్నైలో చాలా మంది ఆప్తులు ఉన్నప్పటికీ వారిని కాదని శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇవ్వడానికి ఇతగాడు బాబు గారి బినామీయే కావడమేకారణం అంటున్నారు.

 

దీనికి  ప్లస్ పెద్దనోట్లు పెద్దల నోట్లో పడుతున్నందుకు నిరసనగా  ‘ప్రశ్నిద్దాం రండి’ పేరుతో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఛలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. తాత్కాలిక  సచివాలయానికి సమీపంలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.


సామాన్యుల ఇళ్లలో డబ్బులు లేక పెళ్లిళ్లు వాయిదా పడుతుంటే, మరోపక్క బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఎలా చేస్తున్నారో మోదీకి కనిపించడం లేదా అని ఆయన అడుగుతున్నారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios