నియోజకవర్గం వరకూ గొట్టిపాటి చెప్పిందే పైనల్ అని గతంలోనే తేల్చి చెప్పినా ఇంకా ఎందుకు నియోజకవర్గం వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ కరణంపై మండిపడ్డారు. ఇంకోసారి చెబుతున్నా, నియోజకవర్గంలో గొట్టిపాటి చెప్పిందే ఫైనల్’ అంటూ తాజాగా తేల్చేసారు.
ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత, ఎంఎల్సీ కరణం బలరాంకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అంటూ తేల్చేసారు. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో అద్దంకి రాజకీయాలు, గ్రూపుల గొడవలపై పెద్ద చర్చే జరిగింది లేండి. అద్దంకి గొడవలంటే కరణం-గొట్టిపాటి గొడవలే కదా? అందుకు వారిద్దరి మధ్య గొడవలపైనే పెద్ద చర్చే జరిగింది.
అదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ, నియోజకవర్గం వరకూ గొట్టిపాటి చెప్పిందే పైనల్ అని గతంలోనే తేల్చి చెప్పినా ఇంకా ఎందుకు నియోజకవర్గం వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ కరణంపై మండిపడ్డారు. ‘ఇంకోసారి చెబుతున్నా, నియోజకవర్గంలో గొట్టిపాటి చెప్పిందే ఫైనల్’ అంటూ తాజాగా తేల్చేసారు. మరోసారి నియోజకవర్గం వ్యవహారంలో జోక్యం చేసుకుంటే బాగుండదన్నట్లుగా హెచ్చరించటంతో పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గొట్టిపాటి వైసీపీలో నుండి టిడిపిలోకి చేరి మహా అయితే ఏడాదిన్నర అయ్యుంటుంది. మరి, కరణం ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పుడు చేరారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పట్టించుకోకుండా టిడిపిలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబుకు బాగా సన్నిహితుడని కూడా ప్రచారంలో ఉంది. అంటే అదంతా ఒకపుడు లేండి. ఎప్పుడైతే గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి కరణమంటే చంద్రబాబుకు మొహం మొత్తినట్లుంది. చంద్రబాబు తాజా హెచ్చరికతో కరణం ఎలా స్పందిస్తారో చూడాలి.
