ఉద్యోగ సంఘాల నేతలకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. ఎప్పటి నుండో తమకు రావాల్సిన బకాయిలను అడrగి సాధించుకుందామని ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సిఎంను కలిసారు. వారు అడగాల్సిందంతా అడిగారు. ఏమేమి బకాయిలున్నాయో, ఎప్పటి నుండి రావాలో కూడా చెప్పారు. అంతా విన్న తర్వాత చంద్రబాబు చెప్పిన సమాధానంతో నేతల నోళ్ళు పడిపోయాయి.

ఉద్యోగ సంఘాల నేతలకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. ఎప్పటి నుండో తమకు రావాల్సిన బకాయిలను అడrగి సాధించుకుందామని ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సిఎంను కలిసారు. వారు అడగాల్సిందంతా అడిగారు. ఏమేమి బకాయిలున్నాయో, ఎప్పటి నుండి రావాలో కూడా చెప్పారు. అంతా విన్న తర్వాత చంద్రబాబు చెప్పిన సమాధానంతో నేతల నోళ్ళు పడిపోయాయి. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే, ‘‘రాష్ట్రం ఆర్ధికంగా బలోపేతం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మించేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తా’’ అని అన్నారు. సిఎం సమాధానం విన్న నేతలకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.

ఎందుకంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగుపడేదెప్పుడు? కేంద్రం ఉద్యోగులను మించి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకునేదెప్పుడు? అది జరిగే పనికాదన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిల లాంటి వాటిపై ఉద్యోగులు ఆశలు వదులుకున్నారు. పైగా రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ప్రభుత్వానికి తోడ్పాటునివ్వాలన్నారు. మొత్తం మీద ఏదో సాధించుకుందామనుకున్న ఉద్యోగ సంఘాల నేతలకే చంద్రబాబు షాక్ ఇచ్చి పంపారు.