చంద్రబాబు చెబుతున్నట్లు నిజంగానే జగన్ తమకు అసలు పోటీనే కాదనుకుంటే ప్లీనరీ అయిపోయి మూడు రోజులవుతున్నా జగన్ ఇచ్చిన హామీలపైనే ఇంకా చంద్రబాబు, మంత్రులు, నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో? ప్రతీ జిల్లాలోను జగన్ హామీలపై మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎదురుదాడులు చేయాలని చెబుతున్నట్లు? వైసీపీ అసలు పోటీనే కాదనుకున్నపుడు 21 మంది ఎంఎల్ఏలను ఎందుకు లాక్కున్నట్లు వైసీపీ నుండి? 24 గంటలూ మంత్రులు, నేతలు జగన్నే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నది ఎందుకు?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమకసలు పోటీనే కాదని చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేసారు. మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ స్ధాయిని తక్కువ చేసి చూపారు. తనపై ప్రజలకు విశ్వాసముందన్నారు. తన పాలనా తీరు, తన అనుభవం చూసే తనను పోయిన ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నట్లు చెప్పారు. వివిధ వర్గాలకు తాను అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు. అందుకనే తనపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉందన్నారు.
తనపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే తనకున్న ప్రజబలమని ధీమా వ్యక్తం చేసారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో జగన్ అసలు పోటీనే కాదని తేల్చేసారు. అమరావతిని ప్రపంచంలోని ఐదుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతీ సంక్షోభాన్ని తనకు అవకాశంగా మలుచుకుంటున్నట్లు చెప్పారు. మౌళిక సదుపాయాల కల్పనకే రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. జాతీయ మీడియా కదా ఇంకా చాలా చాలా చెప్పారు లేండి.
చంద్రబాబు చెబుతున్నట్లు నిజంగానే జగన్ తమకు అసలు పోటీనే కాదనుకుంటే ప్లీనరీ అయిపోయి మూడు రోజులవుతున్నా జగన్ ఇచ్చిన హామీలపైనే ఇంకా చంద్రబాబు, మంత్రులు, నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో? ప్రతీ జిల్లాలోను జగన్ హామీలపై మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎదురుదాడులు చేయాలని చెబుతున్నట్లు? వైసీపీ అసలు పోటీనే కాదనుకున్నపుడు 21 మంది ఎంఎల్ఏలను ఎందుకు లాక్కున్నట్లు వైసీపీ నుండి? 24 గంటలూ మంత్రులు, నేతలు జగన్నే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నది ఎందుకు?
అసలు ఇన్ని మాటలు అవసరమే లేదు, నంద్యాల ఉపఎన్నికల్లో గెలవటానికి టిడిపి ఎంత ఆపసోపాలు పడుతున్నదీ అందరూ చూస్తున్నదే కదా? పోటీ అనివార్యమని తెలిసినా పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలంటూ చంద్రబాబు, మంత్రులు ఎన్నిసార్లు జగన్ పై తెస్తున్న ఒత్తిడి అందరూ చూస్తున్నదే కదా? ఎప్పుడో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జగన్ అసలు పోటీనే కాదనుకున్నపుడు నంద్యాల ఉపఎన్నికపై ఎందుకు అంత అవస్తలు పడుతున్నారో చెబితే బాగుంటుంది.