చంద్రబాబు కొత్త బ్లాక్ మెయిల్

చంద్రబాబు కొత్త బ్లాక్ మెయిల్

‘రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఓట్లేయకపోతే జనాలు సిగ్గుపడాలి’...ఇవి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధికి ఓట్ల రూపంలో కూలీ అడుగుతున్నాను. ‘ఎందుకు అడగకూడదండి..తనకు కూలీ ఎందుకు ఇవ్వరు ? అంటూ దబాయించటం విచిత్రంగా ఉంది.

రాష్ట్రాభివృద్ధిని తాను ఓ యజ్ఞంలా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో తాను పడ్డ కష్టానికి ఓట్ల రూపంలో కూలీ అడుగుతున్నాను అంటూ సమర్ధించుకున్నారు. రాష్ట్రంలోని అన్నీ సీట్లలో టిడిపి గెలవాలన్నదే తన ఉద్దేశ్యంగా చెప్పారు. ‘ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల అభ్యర్ధులు గెలవకపోతే అక్కడి ఓటర్లు టిడిపికి ఓట్లేయనందుకు సిగ్గుపడాలి’ అని చెప్పటంపై సర్వత్రా చర్చ మొదలైంది. పైగా తనకు అభివృద్ధే ముఖ్యమని, ఎన్నికలు, ఓట్లు అన్నవి ఉపఉత్పత్తులని చెప్పారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను అభివృద్ధి చేయటం లేదని చెప్పుకున్నారు. ఉగాది కానుకగా 4 లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రాజకీయ లబ్దికి కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదంతా బాగానే ఉందికానీ, టిడిపికి ఓట్లు వేయనందుకు జనాలు సిగ్గుపడాలి అని చెప్పటంపైనే అందరూ విస్తుపోతున్నారు. అభివృద్ధి పేరుచెప్పి చంద్రబాబు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుంది. మొన్నటి వరకేమొ నేతలు కష్టపడితేనే, జనాల్లో తిరుగుతుంటేనే గెలుస్తారంటూ చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటిది తాజాగాగా ‘ఎక్కడైనా టిడిపి  ఓడిపోతే ఓట్లేయనందుకు జనాలే సిగ్గుపడాలి’ అంటున్నారు...ఎలాగుంది చంద్రబాబు లాజిక్?

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page