కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం

Naidu says party cadre welfare is his main motto
Highlights

  • కార్యకర్తల సంక్షేమ కోసం నిత్యం ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం చాలా గర్వకారణంగా ఉందన్నారు

‘జాతీయ పార్టీ కార్యాలయంకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది’ .. ఇది చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమ కోసం నిత్యం ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ లో పార్టీ అధికారంలో లేకున్నా అక్కడ వచ్చిన ప్రకృతి వైపరీత్యంలో దెబ్బతిన్న ప్రజలకు సాయం చేసిన పార్టీగా గుర్తు చేసుకున్నారు. పార్డీకి ఓ అండందండ మొత్తం పార్టీ కార్యకర్తలే అన్నారు. పార్టీలో కార్యకర్తలు నాయకులు అందరు పార్టీ శ్రామికులే అని చెప్పారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పిన విధంగా రాబోయో తొమ్మిది నెలలో ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పార్టీ కార్యలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం 4.20 నిలకు  ప్రజల సమస్యలు పరిష్కారం కోసం తన ఇంటి పక్కనే గ్రీవెన్స్ సెల్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రోజును మరో నూతన అధ్యయనంకు నాంది పలకబోతున్న రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. రియల్ టైమ్ గవర్నన్స్ కోసం కామెండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.

రియల్ టైం ద్వారా ఏ శాఖ పనితీరు ఎలా ఉందో తెలుసుకొని పరిపాలనను మరింత సులభతరం చేయబోతున్నామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలిలో అత్యంత ధనవంతుల్లో మన తెలుగువారుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం నిత్యం పోరటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీగా పేర్కొన్నారు. ఈ జాతీయపార్టీ కార్యలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తామని, ప్రతి కార్యకర్త కోసం నిత్యం పార్టీ వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

loader