Asianet News TeluguAsianet News Telugu

జగన్ రాష్ట్రాన్నీ తాకట్టు పెట్టేస్తారట...

సమావేశమేదైనా, సందర్భం ఏదైనా సరే జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబునాయుడు సమావేశాన్ని ముగించటం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది, పార్టీ ఏం చేయాలన్న విషయాలను చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారు. టిడిఎల్పీ సమావేశంలో కూడా అదే జరిగింది.

naidu says jagan is selfish

సమావేశమేదైనా, సందర్భం ఏదైనా సరే జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబునాయుడు సమావేశాన్ని ముగించటం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది, పార్టీ ఏం చేయాలన్న విషయాలను చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారు. చంద్రబాబు ఏకైక లక్ష్యమేమిటంటే జగన్మోహన్ రెడ్డిని వీలైనంత ఎండగట్టటం ఒక్కటే. టిడిఎల్పీ సమావేశంలో కూడా అదే జరిగింది.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టిడిఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తన అవసరం గడుపుకోవటం ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తాడని ధ్వజమెత్తారు. తన అవసరల కోసం పార్టీ విధానాలనే కాదు రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టగల సమర్ధుడు అంటూ జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ ఎంఎల్ఏలకు చంద్రబాబు స్పష్టం చేసారు. తన కేసులపై దర్యాప్తు చేస్తున్న అధికారులపై బురదచల్లటం జగన్ కు అలవాటేనన్నారు. గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపైన కూడా ఆరోపణలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసారు.

తన కేసుల్లో అధికారులు మెత్తగా వ్యవహరించాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఈ విధంగా బురదచల్లుతున్నట్లు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈడీ కేసుల్లో నుండి బయటపడేందుకు మహామహుల వల్లే కాలేదట. ఈడీ కేసులు నమోదు చేసాక శిక్ష నుండి తప్పించుకోవటం అసాధ్యమంటూ చంద్రబాబు జోస్యం కూడా చెప్పారు. ఏం చెప్పినా జగన్ కేసుల నుండి తప్పించుకోలేరని, మహా అయితే, శిక్ష పడటం కొంత జాప్యం జరగవచ్చని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాభివృద్ధికి జగన్ అన్నీ విధాల అడ్డుపడుతున్నట్లు మండిపడ్డారు. పట్టిసీమ కడుతుంటే వ్యతిరేకించారు, పోలవరంకు అడ్డుపడాలని ప్రయత్నించారన్నారు. రైతులను భూములు ఇవ్వదంటూ రెచ్చగొట్టాలని చూసారంటూ ధ్వజమెత్తారు. మొత్తం మీద జగన్ వంటి అభివృద్ధినిరోధక వ్యక్తి రాష్ట్రంలోనే లేరంటూ ఎద్దేవా చేయటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios