చంద్రబాబు అధికారంలొకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలు, బార్లే కాదు బెల్టుషాపులు కూడా బాగా పెరిగిపోయాయి. రాష్ట్ర రహదారులను కుదించేసి జిల్లా రహదారులుగా మార్చేయలేదా? అలా ఎందుకు చేసిందంటే మద్యం ఆదాయం పోగొట్టుకోవటం ఇష్టం లేకేకదా? కొత్త మద్యం పాలసీ అంటూ ఏడదికి ఒకసారి లైసెన్సు రెన్యువల్ విధానాన్ని పక్కనబెట్టి ఏకంగా ఐదేళ్లకొకసారి లైసెన్సు ఎందుకిచ్చారు? మెజారిటీ బెల్టుషాపులు టిడిపి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్న విషయం ఎన్నోసార్లు బయటపడింది.
‘ఈనెలాఖరులోగా బెల్టు షాపులను సంపూర్ణంగా తొలగిస్తాం..ఆదాయం తగ్గినా మద్యాన్ని ప్రోత్సహించం.’..ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. సోమవారం సాయంత్రం టిడిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. చంద్రబాబు చెప్పింది బాగనే ఉంది. ఆదాయం తగ్గినా మద్యాన్ని ప్రోత్సహించరట. ఏ ముఖ్యమంత్రైనా చెప్పేదదే. కానీ చేసేది మాత్రం వేరుగా ఉంటుంది. ఎందుకంటే, మొన్నటికమొన్న మద్యం దుకుణాణాలను, బార్లను విపరీతంగా పెంచేసి సంగతిని అందరూ చూసిందే. చంద్రబాబు అధికారంలొకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలు, బార్లే కాదు బెల్టుషాపులు కూడా బాగా పెరిగిపోయాయి.
కొత్త మద్యం విధానంలో భాగంగా సుమారు వెయ్యి మద్యం షాపులు, 400 వరకూ కొత్త బార్లను ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారులకు పక్కనే ఉన్న షాపులను, బార్లను తొలగించాలని సుప్రింకోర్టు ఆదేశించింది. రహదారులకు 500 మీటర్ల లోపు షాపులను కానీ బార్లను కానీ అనుమతించవద్దని స్పష్పంగా చెప్పింది. కానీ ప్రభుత్వం ఏం చేసింది?
సుప్రిం ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకంగా రాష్ట్ర రహదారులను కుదించేసి జిల్లా రహదారులుగా మార్చేయలేదా? అలా ఎందుకు చేసిందంటే మద్యం ఆదాయం పోగొట్టుకోవటం ఇష్టం లేకేకదా? మళ్ళీ ఈ కహానీలెందుకు? కొత్తగా అనుమతిలిచ్చిన షాపులు, బార్లకు ఏకంగా ఇళ్ళు, బళ్ళు, గుళ్ళు అన్న తేడాలేకుండా ఎక్కడ అవకాశముంటే అక్కడల్లా పెట్టుకోమన్నారు కదా? నిజంగా జనాల మీద ప్రేమే ఉంటే అసలు, షాపులు, బార్లను పెంచటమెందుకు? కొత్త మద్యం పాలసీ అంటూ ఏకంగా ఏడదికి ఒకసారి లైసెన్సు రెన్యువల్ విధానాన్ని పక్కనబెట్టి ఏకంగా ఐదేళ్లకొకసారి లైసెన్సు ఎందుకిచ్చారు?
ఇక, బెల్టుషాపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పోయిన ఎన్నికల్లో బెల్టుషాపులు నడిపేవారి బెల్టు తీస్తానంటూ బహిరంగ సభల్లో ఇచ్చిన హామీని మరచిపోయినట్లున్నారు. రాష్ట్రంలో అసలు బెల్టు షాపులన్నదే లేకుండా చేస్తామంటూ భీకర ప్రతిజ్ఞలు చేసిన సంగతి వాస్తవమేకదా? కానీ అధికారంలోకి రాగానే జరిగిందేంటి? అంతకుముందుకన్నా బెల్టుషాపులు బాగా ఎక్కువైపోయాయి. రాష్ట్రంలో కొన్ని వేల బెల్టుషాపులున్నాయి. మెజారిటీ షాపులు టిడిపి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్న విషయం ఎన్నోసార్లు బయటపడింది. అయినా ఎవరిపైనా చర్యలు లేవు. మరింకెందుకు చంద్రబాబు కథలు చెబుతున్నారు.
?
