‘‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరావతి నిర్మిస్తాం’’....ఇది చంద్రబాబునాయుడు తాజాగా చెప్పిన మాట.

‘‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరావతి నిర్మిస్తాం’’....ఇది చంద్రబాబునాయుడు తాజాగా చెప్పిన మాట. రాజధానిపై చంద్రబాబు కొత్త రాగాన్ని అందుకున్నారు. దసరా శుభాకాంక్షలు చెప్పటానికి చంద్రబాబు ప్రజలకు గురువారం బహిరంగ లేఖ రాసారు. అందులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్నారే గానీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తాం? లాంటి వాటి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి అమరావతికి ప్రజారాజధాని అని పేరైతే పెట్టారు గానీ ఇంతవరకూ జరిగిన వ్యవహారంలో జనాలకు ఏమాత్రం సంబంధం లేదు. అంతా ఏకపక్షంగానే సాగించుకుంటున్నారు. జనాలకు కాదుకదా చివరకు ప్రదాన ప్రతిపక్షమైన వైసీపీకి కూడా ఎందులోనూ భాగస్వామ్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే, ఎటూ లేఖ రాసారు కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ కూడా ఇచ్చారు. రెండో దశ సంస్కరణలతో ప్రజలకు కలిగే లాభం ఇదేనంటూ చెప్పారు. నిరంత విద్యుత్ కోరతతో మూతపడిన అనేక పరిశ్రమలు మళ్ళీ త్వరలో ప్రరంభమవుతాయని కూడా తెలిపారు. 2019 నాటికి పోలవరం నుండి గ్రావిటీ ద్వారా నీరిస్తామని కూడా హామీ ఇచ్చారు.