చంద్రబాబునాయుడు స్వరం మారుతోంది. మొన్నటి వరకూ ప్రభుత్వంపై జనాల్లో 80 శాతం సంతృప్తిగా ఉన్నారని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది పార్టీ నేతలు, సమన్వయ  కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల 41 శాతం జనాలు అసంతృప్తిగా ఉన్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

చంద్రబాబునాయుడు స్వరం మారుతోంది. మొన్నటి వరకూ ప్రభుత్వంపై జనాల్లో 80 శాతం సంతృప్తిగా ఉన్నారని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది పార్టీ నేతలు, సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల 41 శాతం జనాలు అసంతృప్తిగా ఉన్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మరి జనాల సంతృప్తస్ధాయి ఒక్కసారిగా 80 శాతం నుండి 41 శాతానికి ఎందుకు పడిపోయిందో చంద్రబాబుకే తెలియాలి.

జనాల్లోని 41 శాతం అసంతృప్తిని 20 శాతానికి తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నంద్యాల, కాకినాడలో ప్రతిపక్షంపై టిడిపి 16 శాతం ఆధిక్యత సాధించిన విషయాన్ని గుర్తు చేసారు. దాన్నే నేతలందరూ తమ నియోజకవర్గాల్లో బెంచిమార్కుగా తీసుకుని పనిచేయాలని హెచ్చరించారు. జనాల సంతృప్త శాతాన్ని 20 శాతం పెంచటంలోనే నేతల సామర్ధ్యం బయటపడుతుందని కుడా చెప్పారు. పథకాల లబ్దిదారులను వీలైనంత పెంచగలిగితేనే సంతృప్తశాతం పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని జిల్లాల కలెక్టర్లకూ తాను వివరించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.