చంద్రబాబు.....‘సాక్షి’ ని మాత్రమే చదువుతారు

Naidu reads sakshi daily
Highlights

విశాఖ పర్యటనలో సాక్షి పత్రికను చదువుతూ కెమెరా కంటికి చిక్కారు. దాంతో చంద్రబాబు ప్రతీరోజు సాక్షి పత్రికను చదువుతారనేందుకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. చంద్రబాబుకు సాక్షి మీడియా అంటే పైకి ఎంత ధ్వేషమో లోనంత ప్రేమ అన్నమాట.

సాక్షి దినపత్రికను చదవద్దండి...సాక్షి టివి చూడొద్దు..నిత్యం జగన్ మీడియా సాక్షి గురించి పార్టీ వేదికలపైనే కాకుండా బహిరంగ సభల్లో కూడా తరచూ చెబుతుంటారు చంద్రబాబునాయుడు. ఎందుకు సాక్షి మీడియాను దూరంగా పెట్టమంటుంటారు? ప్రభుత్వం గురించి అసత్యాలు రాస్తుందట. అందుకే మీడియా సమావేశాల్లో కూడా సాక్షి విలేకరులు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పరు. ఒక్కోసారి విలేకరుల సమావేశానికి కూడా రానీయరు. సాక్షి మీడియా అంటే సిఎంకు ఎందుకంత కసి అంటే మెజారిటీ మీడియా లాగ చిడతలు పట్టుకుని  భజన చేయదుకాబట్టి.

నిజంగా చంద్రబాబుక సాక్షి మీడియా అంటే ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుంటుందనే అనుకుంటారు నేతలందరూ. కానీ నిజానికి జరుగుతున్నదేమిటి? ప్రతీ రోజూ తెల్లవారి లేవగానే చంద్రబాబు ముందు చదివేది సాక్షి దినపత్రికనే. మన పేపర్లు ఎటూ మనగురించి భజనే చేస్తుంటాయి. వాటి గురించి ఎప్పుడు చదివినా ఒకటే..ప్రభుత్వంలో ఏం జరుగుతోందో నిజంగా తెలియాలంటే చదవాల్సింది సాక్షి పత్రికనే. అదే చంద్రబాబు ఫిలాసఫి.

మంగళవారం విశాఖపట్నంకు వెళ్లిన చంద్రబాబు విమానాశ్రయం నుండి బ్రిక్స్ సమావేశం జరిగే వేదిక దగ్గరకు వెళ్ళే సమయంలో చదివింది సాక్షి దినపత్రికనే. వాహనంలో అన్నీ దినపత్రికలూ ఉన్నా చంద్రబాబు మాత్రం చదివింది ఒక్క సాక్షినే. చంద్రబాబు క్రమం తప్పకుండా సాక్షి పేపర్ను చదువుతారు. జిల్లాల వారీగా చంద్రబా సమీక్షా సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే కదా?

అనంతపురం జిల్లా సమీక్షలో నేతల గురించి మాట్లాడేటపుడు జిల్లా స్ధాయిలో ఏ నేత ఏం చేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు పూసగుచ్చినట్లు చెప్పారు. అప్పుడే సిఎం రోజు సాక్షి దినపత్రికను చదువుతారన్న విషయం బయటపడింది. అయితే, విశాఖ పర్యటనలో సాక్షి పత్రికను చదువుతూ కెమెరా కంటికి చిక్కారు. దాంతో చంద్రబాబు ప్రతీరోజు సాక్షి పత్రికను చదువుతారనేందుకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. చంద్రబాబుకు సాక్షి మీడియా అంటే పైకి ఎంత ధ్వేషమో లోనంత ప్రేమ అన్నమాట. అర్ధమైందా తమ్ముళ్ళూ...

loader