నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు వైఖరి కూడా క్విడ్ ప్రోకోనే తలపిస్తోందన్నది మాత్రం వాస్తవం. గెలుపు కోసం బాధితులతోనూ, సామాన్య జనాలతోనూ చంద్రబాబు ఓట్లేయించుకునేందుకు బహిరంగంగానే అనేక రకాల ఒప్పందాలు చేసేసుకుంటున్నారు. ‘మాకు ఓట్లేసి గెలిపించండి..మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలిచ్చేయటాన్ని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి.
‘పనులు కావాలంటే ముందు టిడిపికి ఓటేయండి’ ముస్లిం పెద్దలకు చంద్రబాబునాయుడు హెచ్చరికలు. ‘కేశవరెడ్డి బాధితులను మేం ఆదుకుంటాం, టిడిపికి ఓట్లేయించండి’ బాధితులకు చంద్రబాబు తాయిలాలు. ‘అభివృద్ధి కావాలంటే మాకే ఓట్లేయండి..మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు, ఫించన్లు తీసుకుంటున్నారు, రేషన్ తీసుకుంటున్నారు, ఏం టిడిపికి మాత్రం ఓట్లేయరా’? ఓటర్లకు బెదిరింపులు. ఇవన్నీ కూడా నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు విన్యాసాలే. వీటిని కూడా ఓ విధంగా క్విడ్ ప్రోకో అనే అంటారన్న విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అసలు, క్విడ్ ప్రోకో అంటే ఏంటి? ‘మాకు కావాల్సింది మీరు చెయ్యండి..మీకు కావాల్సింది మేం చేస్తాం’ అనే ఒప్పందమే కదా?
క్విడ్ ప్రోకో అన్న పదం చాలా పాతదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరుగుతున్న అక్రమాస్తుల కేసుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులరైంది లేండి. సరే, ఆ కేసులు, విచారణ ఎప్పటికి తేలుతుందో ఏమో. జగన్ విషయాన్ని పక్కనబెడితే, తాజాగా నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు వైఖరి కూడా క్విడ్ ప్రోకోనే తలపిస్తోందన్నది మాత్రం వాస్తవం. నంద్యాలలో గెలుపు కోసం బాధితులతోనూ, సామాన్య జనాలతోనూ చంద్రబాబు ఓట్లేయించుకునేందుకు బహిరంగంగానే అనేక రకాల ఒప్పందాలు చేసేసుకుంటున్నారు. ‘మాకు ఓట్లేసి గెలిపించండి..మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలిచ్చేయటాన్ని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి.
నంద్యాల పర్యటన సందర్భంగా వచ్చిన చంద్రబాబును ముస్లిం పెద్దలు కలిసారు. తమ సమస్యలు చెప్పుకుందామనుకున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్రార్ధనే చేస్తారో..కన్విన్స్ చేస్తారో..ఓట్లన్నీ టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికే పడాలి’. ఇది ముస్లిం పెద్దలతో చంద్రబాబు చెప్పిన మాటలు. అంతుకుముందు కేశవరెడ్డి విద్యాసంస్ధ బాధితులు పలువురితో కూడా చంద్రబాబు సమక్షంలోనే టిడిపి నేతలు బేరాలు కుదుర్చుకున్నారని ప్రచారం.
కేశవరెడ్డి వల్ల వేలాదిమంది వందల కోట్ల రూపాయలు నష్టపోయారు. వారిలో కొందరితో టిడిపి నేతలు బేరాలు కుదుర్చుకున్నారట. వారుగనుక టిడిపికి ఓట్లేయిస్తే టిడిపి వారిని ఆర్ధికంగా ఆదుకునేలా ఒప్పందాలు జరిగాయట. ఇటువంటి ఒప్పందాలు చాలానే జరుగుతున్నాయ్ లేండి. అదే సంరద్భంగా చంద్రబాబు పలు గ్రామాల్లో తిరిగారు. అప్పుడు కూడా గ్రామస్తులు తమ సమస్యలను చెప్పుకున్నారు. వారితో చంద్రబాబు మాట్లాడుతూ, టిడిపి అభ్యర్ధికి ఓట్లేసి గెలిపించండి, మీక్కావాల్సిన పనులన్నీ చేస్తామంటూ చెప్పటం గమనార్హం. అంటే, టిడిపికి ఓట్లేస్తేనే ప్రభుత్వం పనులు చేస్తుందన్న మాట. లేకపోతే ఏ పనీ చేయదనేగా అర్ధం.
