Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగుల మెడపై ‘పనితీరు కత్తి’

  • పనితీరు సరిగా లేని ఉద్యోగులను ప్రభుత్వం 50 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయించేందుకు భారీ కుట్ర దాగున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
  • న్యాయ, ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారుల ఆమోదం కూడా పొందిన బిల్లు త్వరలో మంత్రివర్గం ముందుకు రాబోతోంది.
  • 35 ఏళ్ళకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి, 45 సంవత్సరాల్లో ప్రభుత్వ సర్వీసులో చేరిన వారి మెడపైన ‘పనితీరు కత్తి’ వేలాడుతోందన్న మాట.
  •  
naidu planning mass retrenchment in Andhra Pradesh

చంద్రబాబునాయుడుకు ఏమైంది? ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణకు పెర్పార్మెన్స్  కు లింకు పెడుతున్నారు. ఉద్యోగుల పనితీరు సరిగా లేదనుకుంటే వారిని బలవంతంగా ఉద్యోగం నుండి బయటకు పంపేసే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. న్యాయ, ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారుల ఆమోదం కూడా పొందిన బిల్లు త్వరలో మంత్రివర్గం ముందుకు రాబోతోంది. చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో జరుగనున్న మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

అంటే పనితీరు సరిగా లేని ఉద్యోగులను ప్రభుత్వం 50 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయించేందుకు భారీ కుట్ర దాగున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  35 ఏళ్ళకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి, 45 సంవత్సరాల్లో ప్రభుత్వ సర్వీసులో చేరిన వారి మెడపైన ‘పనితీరు కత్తి’ వేలాడుతోందన్న మాట. అసలు ఉద్యోగుల పనితీరును ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తుంది. అటెండర్ నుండి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విధుల వరకూ ప్రతీ చోటా రాజకీయ జోక్యం పెరిగిపోయిన నేపధ్యంలో ఇక, ఉద్యోగుల పనితీరు సక్రమంగా ఎలాగుంటుంది? ఏ ఉద్యోగినైనా ముఖ్యమంత్రి, మంత్రులు లేదా అధికారపార్టీ నేతలు ఏనాడైనా స్వేచ్చగా పనిచేయనిస్తే కదా?

పనితీరు ఆధారంగా ఉద్యోగిని ఇంటికి పంపటానికి వీలుగా ప్రభుత్వం ఐదు జీవోలను కూడా రెడీ చేసింది. అవి విడుదలవ్వటమే మిగిలింది. ఉద్యోగుల పనితీరును స్టడీ చేయటానికి ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా నియమించింది. అంటే ఆ కమిటీలను నియమించేంది ఎలాగూ ముఖ్యమంత్రే కదా? కాబట్టి అధికారపార్టీ పెద్దలు చెప్పిన ఉద్యోగులందరినీ తొలగించటం ఖాయం. బహుశా తొలగించిన వారి స్ధానంలో తమ వారిని నియమించుకోవటానికి అధికారపార్టీ కుట్ర చేస్తోందేమో? ఇపుడిదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే, సుమారు 6 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు మరి. సరే, వీరెవరూ కొత్త విధానాన్ని ఆమోదించటం లేదనుకోండి అది వేరే సంగతి. ఇప్పటికే ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైపోయింది.ల

సాధారణ ఎన్నికలకు ఇంక ఉన్నది రెండేళ్ళే. పైగా జనాలకు ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. అన్నింటికీ మించి నంద్యాల ఉపఎన్నికకు ఈరోజే నోటిఫికేష్ విడుదలైంది. ఇటువంటి పరిస్ధితుల్లో ఎంత బుర్రలేని వాడైనా అందరినీ మంచి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అటువంటిది జనాలతో పాటు ప్రత్యేకంగా ఉద్యోగులందరినీ ఎందుకు దూరం చేసుకుంటున్నారో అర్ధం కావటం లేదు. అంటే టిడిపికి మొదటినుండి ఉద్యోగి వ్యతిరేక పార్టీ అన్న ముద్రను మరింత బలపరుచుకోవాలనుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్ళు పెంచిన చేత్తోనే ఇపుడు ఏకంగా 8 ఏళ్ళ సర్వీసును తగ్గించేస్తున్నారన్నమాట.

 

Follow Us:
Download App:
  • android
  • ios