పదే పదే ఎన్నికలు జరగుతుండటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని సిఎం అభిప్రాయం. అభివృద్ధికి-ఎన్నికలకు ముడిపెడితే సరిపోయేదానికి సీతాదేవి శీలపరీక్షను ఉదాహరణగా చూపటమే ఇపుడు వివాదాస్పదమైంది.

తండ్రి, కొడుకులకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో పోటీ పడుతున్నట్లున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన ‘సీతాదేవి శీలపరీక్ష’ వ్యాఖ్యలు అదే విధంగా ఉన్నాయి. కోడలు మనవడిని కంటానంటే ఏ అత్త అయినా వద్దంటుందా? అంటూ మీడియా ముఖంగా ప్రశ్నించటంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అదేవిధంగా ఎవరికైనా ఏకులంలో పుట్టాలనే విషయంలో ఛాయిస్ ఉంటే ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారా అని వేసిన ప్రశ్నపై ఎస్సీ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబు చాలానే చేసారు. సరే, లోకేష్ సంగతి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అటువంటిదే చంద్రబాబు తాజాగా సీతాదేవిపై చేసి మరోసారి మహిళా సంఘాలను కెలికారు. పదే పదే ఎన్నికల జరగటంపై మాట్లాడుతూ, ప్రతీ మూడు నెలలకూ ఒకసారి సీతాదేవిలా పదే పదే శీలపరీక్షకు నిలబడాలా? అంటూ మీడియాను ప్రశ్నించారు. పదే పదే ఎన్నికలు జరగుతుండటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని సిఎం అభిప్రాయం. అభివృద్ధికి-ఎన్నికలకు ముడిపెడితే సరిపోయేదానికి సీతాదేవి శీలపరీక్షను ఉదాహరణగా చూపటమే ఇపుడు వివాదాస్పదమైంది.