మొదటి నుండి అంతే చంద్రబాబు వ్యవహారం. ప్రభుత్వ విధానాలు జనాలకు నచ్చకపోతే ఏ ముఖ్యమంత్రైనా ఏం చేస్తారు? చేసినా చేయకపోయినా కనీసం జనాలకు ఏం కావాలో అడుగుతారు. జనాలు చెప్పింది విని అప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు.
చంద్రబాబునాయుడుది మొదటి నుండి రివర్స్ గేరే. తన వద్దకు వచ్చిన వారైనా చంద్రబాబు మాట వినాల్సిందే...ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్ళినా ఆయన మాట వినాల్సిందే. లేకపోతే మొన్న నంద్యాలలో జనాలతో మాట్లాడుతున్నపుడు చూసారుగా ఏం మాట్లాడారో?
ఇప్పుడని కాదుకానీ మొదటి నుండి అంతే చంద్రబాబు వ్యవహారం. ప్రభుత్వ విధానాలు జనాలకు నచ్చకపోతే ఏ ముఖ్యమంత్రైనా ఏం చేస్తారు? చేసినా చేయకపోయినా కనీసం జనాలకు ఏం కావాలో అడుగుతారు. జనాలు చెప్పింది విని అప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. అయితే, చంద్రన్న మాత్రం తన ప్రభుత్వం నచ్చకపోతే పెన్షన్ తీసుకోవద్దు, రేషన్ తీసుకోవద్దు, రోడ్లపై నడవద్దన్నారు. అప్పటికేదో తన జేబులో నుండి తీసి ఖర్చు పెడుతున్నట్లు జనాలకోసం.
ఎన్టీఆర్ ను పదవిలో నుండి దింపేటప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు. లక్ష్మీపార్వతి చేతిలోకి టిడిపి వెళ్ళిపోవటం నచ్చకే ఎన్టీఆర్ను సిఎంగా దింపేసారట. ఎలావుంది లాజిక్? లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాక పార్టీలో లక్ష్మీపార్వతి హవా పెరిగిందన్నది వాస్తవం. దాన్ని సహించేని చంద్రబాబు లక్ష్మీపార్వతి నుండి పార్టీని రక్షించుకోవటం కోసం ఎన్టీఆర్ నే దింపేసారట.
సరే, దానికి అధికారమార్పిడి అని ఓ ముద్దుపేరు పెట్టుకున్నారులేండి అది వేరే సంగతి. ఎవరికైనా ముఖ్యమంత్రి వైఖరి నచ్చకపోతే ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైఖరి నచ్చకపోతే చంద్రబాబు టిడిపి నుండి వెళ్లిపోవాలి. కొత్త పార్టీ పెట్టుకోవాలి. అంతేకానీ ఏకంగా ఎన్టీఆర్ నే పదవిలో నుండి దింపేసారు.
అంటే మొదటి నుండి చంద్రబాబుది రివర్స్ గేరే అన్న విషయం అర్ధం కావటం లేదా? ఇక, కేసుల విచారణ విషయం చూసినా అదే పద్దతి. ‘ఓటుకునోటు’ కేసు విచారణను వేగం వంతం చేయాలని వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేస్తే దానికి సమాధానమివ్వకుండా అసులు కేసు వేసే హక్కే ఆళ్ళకు లేదని వాదించారు. బాగుంది కదూ చంద్రబాబు రివర్స్ గేర్.
