జగన్ కు మించిన హామీలు ఏమిస్తారు? ఎందుకంటే, 2014లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు సక్రమంగా అమలు  చేయలేదు. అవే సక్రమంగా అమలు కానపుడు మళ్ళీ కొత్త హామీలు ఏమిస్తారు? జనాలు ఎందుకు నమ్ముతారు? రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, ధరల స్ధిరీకరణ నిధి లాంటి హామీలు ఎలా అమలవుతున్నాయో అందరూ చూస్తున్నదే.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరి సందర్భంగా ఇచ్చిన హామీలతో చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు మొదలయ్యాయి. పోయిన ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను గుప్పించిన చంద్రబాబు మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అయితే, అప్పట్లో చంద్రబాబు హామీలు ఆచరణ సాధ్యం కావని, ప్రజలను మోసం చేయటమే లక్ష్యంగా హామీలుస్తున్నారంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారనుకోండి అదివేరే సంగతి.

అయితే చంద్రబాబు హామీలు, అమలు తీరును గమనించిన జగన్ కు కూడా హామీల విషయంలో ధైర్యం వచ్చినట్లంది. అందుకనే ప్లీనరీ సందర్భంగా అనేక హామీలిచ్చేసారు జగన్. అయితే, సమస్య ఇపుడు చంద్రబాబును చుట్టుకుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉండగానే జగన్ మ్యానిఫెస్టో లాంటి హామీలను ప్రకటించేసారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గనుక జనాలకు హామీలివ్వాలంటే ఇపుడు జగన్ ఇచ్చిన హామీలకు మించే ఇవ్వాలి.

జగన్ కు మించిన హామీలు ఏమిస్తారు? ఎందుకంటే, 2014లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదు. అవే సక్రమంగా అమలు కానపుడు మళ్ళీ కొత్త హామీలు ఏమిస్తారు? జనాలు ఎందుకు నమ్ముతారు? రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, ధరల స్ధిరీకరణ నిధి లాంటి హామీలు ఎలా అమలవుతున్నాయో అందరూ చూస్తున్నదే.

ఇక, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ హామీలను చంద్రబాబు అటకెక్కించేసిన విషయం అందరికీ తెలిసిందే. మహా అయితే, చంద్రబాబు ఏం చేయగలరు? మిత్రపక్షం భారతీయ జనతా పార్టీతో కటీఫ్ చెప్పుకుని ఇంతకాలం తన హామీలు అమలు కాకుండా కేంద్రప్రభుత్వం అడ్డుకుందని కొత్త నాటకాలు మొదలు పెట్టాలి. జనాలు నమ్ముతారా? భాజపా చూస్తూ ఊరుకుంటుందా? ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగ తయారైంది.