కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రోకో లాంటిది జరిగిందన్నమాట. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసినందుకు రాష్ట్రం ప్రత్యేకహోదా అంశాన్ని వదిలేసుకోవాలి.
చంద్రబాబునాయుడుకు నోట మాట రావటం లేదు. ఎందుకంటే కేంద్రం చేతిలో ఇరుక్కున్నందుకు ఇపుడు పోలవరానికి నిధులూ రావటం లేదు...ప్రత్యేకహోదా కూడా పోయింది. చంద్రబాబు మొన్నటి వరకూ ఓ మాట చెప్పేవారు. ‘పోలవరానికి నిధులు ఇస్తానంటేనే తాను ప్యాకేజికి అంగీకరించాను’ అని. నిజానికి ఇక్కడే చంద్రబాబు డొల్లతనం బయటపడింది. ప్రత్యేకహోదా అయినా, పోలవరం ప్రాజెక్టు అయినా విభజన చట్టంలోని హామీలే. హామీలను కేంద్రప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందే. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింటిని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి తూఛ్ పొమ్మన్నారు.
ఈ సమయంలోనే ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు విఫలమయ్యారు. ఎందుకంటే, అప్పటికే ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్నారు. ఆ కేసులో నుండి బయటపడాలంటే కేంద్రసాయం అవసరం. అందుకనే కేంద్రం ఏమి చెప్పినా కాదనలేక తలూపుతున్నారు. అందుకనే కేంద్రం ప్రత్యేకహోదాను ఇవ్వనుపొమ్మంది. అంతుకుముందే కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఒత్తిడిపెట్టి మరీ తన చేతుల్లోకి లాక్కున్నారు. 2014లో ప్రాజెక్టు అంచనాలను రూ. 16 వేల కోట్ల నుండి రూ. 40 వేల కోట్లకు తీసుకెళ్ళారు. కమీషన్ల కోసమే అంచనా వ్యయం పెరిగిపోయిందన్న ప్రచారం ఊపందుకున్నది.
అంటే కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రోకో లాంటిది జరిగిందన్నమాట. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసినందుకు రాష్ట్రం ప్రత్యేకహోదా అంశాన్ని వదిలేసుకోవాలి. పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం భరించేందుకు అంగీకరించిందని చంద్రబాబు ఇంతకాలం ప్రచారం చేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఢిల్లీ స్ధాయిలో బాగా హడావుడి కూడా చేసారు. తీరా చూస్తే పెరిగిన అంచనాలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టం చేసారు. దాంతో చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుల నోరు పెగలటం లేదు. చంద్రబాబుకు ప్రతీ విషయంలోనూ పక్కతాళం వేసే వెంకయ్యనాయుడుకు కూడా మొహం చెల్లటం లేదు.
