చంద్రబాబుకు ఒక కన్ను కనిపించదా...

Naidu has no interest in proposed steel plant in Anantapur district
Highlights

విశాఖ ఎంఒయులసంగతి సరే, అంతకు ముందెపుడో చేసుకున్న అనంతపురం స్టీల్ ప్లాంట్ ఎంఒయు ఏమయింది?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనంతపురం రెండో కన్ను. మొదటి కన్ను పశ్చిమగోదావరి జిల్లా. ఈవిషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పారు. ఎందుకంటే, ఈ జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవడమే కాకుండా రెండు ఎంపి స్థానాలలో కూడా ప్రజలు టిడిపినే గెలిపించారు.

 

ఎందుకలా జరిగిందో అంత ఈజీగా అర్థం కాదు. ఈ అనందంతోనే ఆయన రెండుకళ్ల సిద్ధాంతం చెప్పారు.  అనంతపురం పదే పదే తిరిగింది కన్ను రాజకీయంతోనే అని. వాటర్ గన్స్ తో అక్కడ కరువు మీద యుద్ధం ప్రకటించి  దాని పారద్రోలినట్లు కూడా ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు. ఈ జిల్లా ఒక కన్ను కాబట్టి జిల్లాకు ఇద్దరు మంత్రులున్నారు. ఒక విఫ్ ఉన్నారు. బాగా నోరున్నఎంపి దివాకర్ రెడ్డి ఉన్నారు. రెండో ఎంపి... ఎక్కడ, ఎపుడూ కనిపించరు వినిపించరు. అదే వేరే విషయం.

 

విశాఖ పట్టణంలో  సిఐఐ భాగస్వామ్య సదస్సు లో  పదిలక్షల కోట్ల పైబడి పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలొస్తున్నాయని ప్రకటించాక , చంద్రబాబు నాయుడి అనంతపురం కన్ను కనిపిస్తున్నాదా అనే అనుమానం వచ్చింది  ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డికి.

 

అనంతపురం కన్ను గుడ్డిది అని, ఆ కన్నుకు వాస్తవాలేవీ కనిపించవు, దానికి కనిపించేవన్నీ వుత్తుత్తి వే నని ఆయన చెప్పారు. ఎందుకంటే,ఇంతకు ముందు  చేసుకున్న ఎంఒయులకు దిక్కులేదు,  10 లక్షల కోట్ల ఎంఒయులు ఎందుకు, ఏట్లో పడేయనా , అని విశాఖ ఎంఒయు లగురించి అడిగినపుడు, అనంతపురం నుంచి ఫోన్ లో మాట్లాడుతూ విశ్వేశ్వ ర్రెడ్డిఎషియానెట్ కు చెప్పారు.

 

దీనికి ఉదాహరణ గా ఆయన రాష్ట్ర ప్రభుత్వం 2013లో కుదుర్చుకున్నఎంఒయును ఉదహరించారు.

 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విశాఖ స్టీల్ , ఎంపి మైనింగ్  కార్పొరేషన్ , కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (KIOCL) అనంతపురం  జిల్లా నేమకల్ లో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని ఎంఒయు కుదుర్చుకున్నారు (ఫోటో). 

ఈ ఒప్పందం ప్రకారం APMDC, KIOCL  ఒక  జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తాయి. ఇనుము నిక్షేపాల ఉనికి కనుగొనడం, వెలికితీసేపని APMCD ది , KIOCL పెల్లెటైజేషన్ ప్లాంట్ ఏర్పాటుచేయాలి. 1500 కోట్ల ఖర్చయ్యే ఈ ప్లాంటు సామర్థ్యం  1.2 మెట్రిక్ టన్నలు. ఈ పెల్లెట్లను విశాఖ స్టీల్ కు సరఫరా చేస్తారు. దీని వల్ల జిల్లాలో 12 వేల మందికి ఉద్యోగాలొస్తాయి.

 

“2013 లోకుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ పాటికి ఈ యూనిట్ ఏర్పాటుచేసి ఉండాలి. అయితే, ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనలో ఒక్కసారయిన  ఈ విషయం మాట్లాడారా. ఈ ఎంఒయు కనిపించలేదంటే,  చంద్రబాబుది రెండు గుడ్డి కళ్ల సిద్ధాంతం కాదా,”అని విశ్వేశ్వ రెడ్డి అన్నారు.

 

కుద్రేముఖ్ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినా, ఐరన్ వోర్ సమృద్ధిగ ఉన్నా ముఖ్యమంత్రి నాయుడు ఎందుకు ఈ పెల్లెట్ పాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోలేదు.

 

 ఇంతకంటే రాయలసీమ మీద,అందునా  అనంతపురం జిల్లా మీద చూపుతున్న వివక్షకు సాక్ష్యం కావాలా అని విశ్వేశ్వరెడ్డి అడుతున్నారు.

 

"అందువల్ల విశాఖ ఎంఒయులన్నీ బోగస్, ఒక వేళ ఏవయిన ఉన్నా అవి కేవలం అమరావతి చుట్టూర పెట్టడానికే. ఈ నేపథ్యంలో ఇపుడు ఉద్యమం నడుస్తున్న కడప జిల్లా స్లీల్ ప్లాంట్ హామీ ఏమయివుంటుందో వేరే చెప్పనవసరం లేదు." అని వైసిపి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

 

 

 

loader