మూడేళ్ళ అభివృద్ధిని సెప్టెంబర్ 17వ తేదీ నుండి మొదలయ్యే కార్యక్రమంలో వివరించి చెప్పాలని చెప్పారు. ప్రతీ జిల్లాలోని గ్రామాలను టచ్ చేయాలన్నారు. తాను ప్రత్యేకంగా కళాశాల విద్యార్ధులతో సమావేశాల నిర్వహించనున్నట్లు కూడా చెప్పారు.

తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచింది. గడచిన మూడేళ్ళల్లో తమ ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ విడమరచి చెప్పాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 27వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా? ఈ నేపధ్యంలోనే జగన్ కన్నా ముందే ‘ఇంటింటికి టిడిపి’ కార్యక్రమాన్ని మొదలుపెట్టేయాలని చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిపిన సమావేశంలో ఇకనుండి పార్టీ కార్యక్రమాలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని చెప్పారు.

విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఆదాయాలు పెంచటానికి తాను చేస్తున్న కృషి, ప్రత్యేకించి రుణమాఫీలు, రాజధాని నిర్మాణానికి తీసుకుంటున్న చొరవ తదితరాలను జనాలకు విడమరచి చెప్పాలని మంత్రులు, నేతలను ఆదేశించారు. వివిధ వర్గాలకు గత ప్రభుత్వాలేం చేసాయి, టిడిపి ఏం చేస్తోందన్న విషయాలను విడమరచి చెప్పాలని చెప్పారు. మూడేళ్ళ అభివృద్ధిని సెప్టెంబర్ 17వ తేదీ నుండి మొదలయ్యే కార్యక్రమంలో వివరించి చెప్పాలని చెప్పారు. ప్రతీ జిల్లాలోని గ్రామాలను టచ్ చేయాలన్నారు. తాను ప్రత్యేకంగా కళాశాల విద్యార్ధులతో సమావేశాల నిర్వహించనున్నట్లు కూడా చెప్పారు.

ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యక్రమం ఖచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. పదవులు పొందిన వారిలో చాలామంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని, కార్యక్రమాల గురించి ఏమాత్రం ప్రచారం చేయటం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రతీ జిల్లాలోనూ ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రితో పాటు ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. జగన్ పాదయాత్రకన్నా ముందే ఇంటింటికి టిడిపి కార్యక్రమం జనాల్లోకి వెళ్ళాలన్నది చంద్రబాబు ఆలోచన.