Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగుల పనిగంటల్లో అర్ధగంట డిస్కౌంట్

  • చంద్రబాబునాయుడు ఏది  చేసినా అందులో ఏదో నిఘూఢార్ధం ఉంటుంది.
  • అప్పటికప్పుడు బయటపకపోయినా మెల్లిగా బయటకొస్తుంది. అటువంటిదే ఒక విషయం వెలుగు చూసింది బుధవారం.
  • చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు అరగంట ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కానీ..ఆఫీసుకే రానంటే మాత్రం కుదరదు’’ అంటూ హెచ్చరించారు.
  • ఏ ముఖ్యమంత్రైనా ఉద్యోగులు టైంకు ఆఫీసుకు రావాలనే చెబుతారు. అంతేకానీ అర్ధగంట లేటుగా అయినా పర్వాలేదని చెప్పారు.
Naidu gave half an hour discount in the employees working hours

చంద్రబాబునాయుడు ఏది  చేసినా అందులో ఏదో నిఘూఢార్ధం ఉంటుంది. అప్పటికప్పుడు బయటపకపోయినా మెల్లిగా బయటకొస్తుంది. అటువంటిదే ఒక విషయం వెలుగు చూసింది బుధవారం. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు అరగంట ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కానీ..ఆఫీసుకే రానంటే మాత్రం కుదరదు’’ అంటూ హెచ్చరించారు. ఏ ముఖ్యమంత్రైనా ఉద్యోగులు టైంకు ఆఫీసుకు రావాలనే చెబుతారు. అంతేకానీ అర్ధగంట లేటుగా అయినా పర్వాలేదని చెప్పారు. ఎందుకంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పనిచేస్తారు అన్న విషయమై జనాల్లో ఇప్పటికే ఓ అభిప్రాయం పాతుకుపోయింది.

ఉద్యోగులందరూ టైంకు రావాలని, సీట్లలో కూర్చోగానే చక చక ఫైళ్ళను పరుగులెత్తించాలనే ఆశిస్తారు ఏ ముఖ్యమంత్రైనా. కానీ చంద్రబాబు మత్రం డిఫరెంటుగా ఆలోచించారు. ఎందుకంటే, ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం. మరి, ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయ్. ఎన్నికల్లో ఉద్యోగుల పాత్ర గురించి చంద్రబాబుకు ఎవరూ కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకనే, ఉద్యోగులను మంచి చేసుకోవటంలో భాగంగానే ఉద్యోగుల పనిగంటల్లో చంద్రబాబు అరగంట డిస్కౌంట్ ఇచ్చారు.

డిసెంబర్లో రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నారట. ఈ ఆఫీసుల్లో రోజుకు 30 ఫైళ్ళు వస్తుంటే అందులో సెక్రెటరీలు 8 పైళ్ళు కూడా క్లియర్ చేయటం లేదట. అందుకనే కాలం తీరిన చట్టాలను మార్చాలన్నారు. ఉద్యోగులు పనిచేయక పోవటానికి చట్టాలను మార్చటానికి ఏం సంబంధమో ఎవరికీ అర్ధం కాలేదు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పనికిరావట. కొన్ని శాఖలు అసలు ఏం చేస్తున్నాయో కూడా అర్ధం కావటం లేదట.

అసలు ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయ్? తమకు కావాల్సిన వారిని అందలం ఎక్కించేందుకు ఒక శాఖను మూడుగా విడదీసారు. ఒకటిగా ఉన్న విద్యాశాఖను ఉన్నత విద్య, మాధ్యమిక+సాంకేతిక విద్యాశాఖగా, ప్రధామిక విద్యాశాఖంటూ మూడుగా విభజించారు. అదే విధంగా చాలా శాఖలను విడదీసారు. దాంతో సిబ్బందినీ పెంచాల్సి వచ్చిందన్నది వాస్తవం. అందుకే అటువంటి శాఖలను త్వరలో రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పారు. పనిలో పనిగా ఆర్ధికాభివృద్ధి శాఖ, కోల్డ్ ఛైన్లు, డ్వాక్రా గ్రూపులకు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios