చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం అవినీతికి బార్లా తలుపులు తీసేదిగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుడా ఇదే విధమైన పద్దతులు అవలంభించటం వల్లే పలువురు ఉన్నతాధికారులు న్యాయస్ధానాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. గతంలో వైఎస్ కుడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నదే. ‘‘నిబంధనలు అనుమతించకపోయినా తాను చెప్పినట్లు లేదా ప్రైవేటు సంస్ధలు, యజమానులు కోరినట్లు నిర్ణయాలు తీసుకోమని చంద్రబాబు ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారట.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం అవినీతికి బార్లా తలుపులు తీసేదిగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుడా ఇదే విధమైన పద్దతులు అవలంభించటం వల్లే పలువురు ఉన్నతాధికారులు న్యాయస్ధానాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే, ‘‘ ప్రైవేటు సంస్ధలు, వ్యక్తులు నెలకొల్పే యూనిట్లు, పరిశ్రమలకు రాయితీలు, ఆర్ధిక ప్రయోజనాలు కల్పించటం, భూములను తక్కువ ధరలకు కేటాయించటం లాంటి నిర్ణయాలపై సంబంధిత అధికారులపై ఏసిబీ, విజిలెన్స్ విచారణ చేపట్టకూడదు’ అని. నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆమేరకు ఉత్తర్వులు కుడా విడుదల చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం.

గతంలో వైఎస్ కుడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నదే. ‘‘నిబంధనలు అనుమతించకపోయినా తాను చెప్పినట్లు లేదా ప్రైవేటు సంస్ధలు, యజమానులు కోరినట్లు నిర్ణయాలు తీసుకోమని చంద్రబాబు ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారట. ఎవరిపైనా ఎటువంటి కేసులు, దర్యాప్తులు లేకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చే పద్దతిలో ఉత్తర్వులున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వైఎస్ కుడా ఇటువంటి భరోసా ఇవ్వటంతోనే ఉన్నతాధికారులు తమ పరిధి మీరి వ్యవహరించారు.

అయితే, ఎవరూ ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించటంతో అందరి చావుకు వచ్చింది. తాజా ఉత్తర్వులు ప్రధానంగా రహదారులు, ఓడరేవులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, లైట్ రైల్ ట్రన్స్ పోర్ట్ వ్యవస్ధల్లో ఎక్కువ ప్రభావం చూపనుంది. అవినీతి అంటూ జరిగి, నిరూపించగలిగితే ప్రభుత్వం ఎన్ని ముందస్తు ఉత్తర్వులిచ్చిన ఉపయోగం ఉండదని వైఎస్ జమానాలో పనిచేసిన ఉన్నతాధికారుల అనుభవాలు చెబుతున్నాయ్. ఇపుడు జరుగుతున్న తంతు చూస్తుంటే చంద్రబాబు కుడా వైఎస్ బాటలోనే నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అసలే, రాజధాని నిర్మాణ ప్రక్రియ, సంస్ధలకు భూముల కేటాయంపులు, పోలవరం, పట్టిసీమ తదితరాల నిర్మాణాల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపణలున్నాయి. పట్టిసీమలో భారీ అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్వయంగా నిర్ధారించిన విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు ఇపుడు ఈ ఉత్తర్వులు విడుదల. దాంతో ఏం చేయాలో ఉన్నతాధికారులకు అర్ధం కావటం లేదు. అసలే, కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమ సీనియర్లను చూస్తున్న ఉన్నతాధికారులకు ఉత్తర్వులతో గుండెల్లో రైళ్ళు పరిగెట్టటం ఖాయం. రాజకీయ నేతల హామీలను నమ్మి ముందుకెళితే ‘‘కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే ’’ అని ఎన్నోమార్లు రుజువైంది. మరి చూడాలి ఇపుడేం జరుగుతుందో.