ఎన్టీఆర్ జయంతి రోజు నిర్వహించుకునే  36వ మహానాడును పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

విశాఖపట్నంలో మూడురోజుల పసుపు పండుగ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి రోజు నిర్వహించుకునే 36వ మహానాడును పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. మహానాడుకు తెలుగురాష్ట్రాల నుండి సుమారు 20 వేలమంది హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఎవరి స్ధాయికి తగ్గట్లు నిర్వాహకులు బస, వసతి ఏర్పాట్లు చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 15 ఎకారల్లో జరుగుతోంది.

పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా పార్టీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజల్వన చేయటంతో మహానాడు ప్రారంభమైంది. పార్టీ కోశాధికారి, మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీకి చెందిన జమా, ఖర్చుల వివరాలను అందించారు.