Asianet News TeluguAsianet News Telugu

ఇసుకపై చంద్రన్న డ్రామాలు

  • ఇసుక ధరలను నియంత్రించటంలో అధికారులు విఫలమయ్యారట.
  • అందుకనే సిఎం గారికి బాగా కోపమొచ్చిందట.
  • ఇసుకను కూడా ఆదాయ వనరుగా మార్చేసారు మూడేళ్ళ క్రితం చంద్రబాబు అధికారంలోకి రాగానే. దాంతో తమ్ముళ్లకు ‘ఇసుక’ కల్పవరువుగా మారింది.
  • డ్వాక్రా సంఘాల ముసుగులో మొత్తం ఇసుకను తమ్ముళ్ళే సాంతం నాకేసారు.
  •  
Naidu fires on officials over sand prices hike

చంద్రబాబునాయుడుకు ఆగ్రహం వచ్చిందట..నిజమే! ఇసుక ధరలను నియంత్రించటంలో అధికారులు విఫలమయ్యారట. అందుకనే సిఎం గారికి బాగా కోపమొచ్చిందట. ‘ఉచిత ఇసుక ఇస్తున్నా ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఏమిటం’టూ ఫైర్ అయ్యారట. నిజమే ఇసుక పై జనాల్లో విపరీతమైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. అయితే, అందుకు కారణాలు కూడా చంద్రబాబే. గడచిన మూడేళ్ళుగా తమ్ముళ్లకు ఇసుక రీచ్ లను రాసిచ్చేసారు. దాంతో వారు రెచ్చిపోయి కోట్లు సంపాదించేసారు. అందుకు అడ్డొచ్చిన వారిని ఎవరైనా సరే వదలకుండా దాడులుచేస్తున్నారు. దాంతో అధికారులు తమ్ముళ్ళ ఇసుక వ్యాపారాన్ని పట్టించుకోవటం మానేసారు.

అధికారులు బాగానే ఉన్నారు. తమ్ముళ్ళూ రెచ్చిపోతున్నారు. మధ్యలో నష్టపోతోంది సామాన్య జనాలే. అందుకే ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తి పేరుకుపోయింది. తమ్ముళ్ళను ఏం అనలేక అధికారులపై రెచ్చిపోతున్నారు. ఎందుకంటే, వారేమీ ఎదురు చెప్పలేరు గనుక.  ఎలాగుంది చంద్రన్న డ్రామాలు. ఎటువంటి పెట్టుబడులూ లేకుండానే ప్రకృతి ప్రసాదితమైన ఇసుకను వందల వేల టన్నులు తోడేసి కోట్లాది రూపాయలు వెనకేసుకుంది పచ్చ బ్యాచ్.

పేరుకేమో డ్వాక్రా మహిళను ఆర్ధికంగా బలోపేతం చేయాలని చెప్పటం. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమొ విరుద్దం. డ్వాక్రా సంఘాల ముసుగులో మొత్తం ఇసుకను తమ్ముళ్ళే సాంతం నాకేసారు. అందుకు సాక్ష్యం కృష్ణాజిల్లా ముసునూరులో ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్-ఎంఆర్ఓ వనజాక్షి మధ్య వివాదమే. ఆ గొడవతోనే తమ్ముళ్ళు ఆదాయం కోసం ఎంతకి తెగిస్తున్నారన్న విషయం బయటప్రపంచానికి తెలిసింది.

సరే, అయిందేదో అయిపోయింది. అప్పటి నుండైనా ప్రభుత్వం జాగ్రత్త పడిందా అంటే అదీలేదు. అప్పటి నుండే పూర్తిగా తమ్ముళ్ళు బరితెగించేసారు, కోటీశ్వరులైపోయారు. దాంతో మొత్తం వ్యవహారంలో అధికారులది ప్రేక్షకపాత్ర అయిపోయింది. శ్రీకాళహస్తిలో 18 మంది గ్రామస్తులు చనిపోయిన విషయం గుర్తుందా? అదికూడా ఇసుక అక్రమ తవ్వకాల నేపధ్యంలో తమ్ముళ్ళకు, గ్రామస్తులకు మధ్య గొడవే కారణం.

వాస్తవాలిలావుండగా, అదికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం క్యామిడీగా లేదు? ఇసుక రీచ్ ల్లో అక్రమ రవాణా జరుగుతోందని ఎవరైనా అధికారులు లారీలను పట్టుకుంటే దాడులు చేస్తున్నారు. ఉద్యోగులు ఎంత కష్టపడమన్నా పడతారు గానీ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేయటానికి ఇదేమన్నా సినిమానా? అయినా మూడేళ్ళుగా పట్టించుకోని చంద్రబాబుకు ఇప్పుడే ఇసుకపై జనాల అసంతృప్తి ఎందుకు గుర్తుకు వచ్చింది? నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరుగుతున్నాయ్ కాబట్టే. త్వరలోనే సాధారణ ఎన్నికలు వస్తాయి. అద్గదీ సంగతి. ఇంకెన్ని డ్రామాలు చూడాలో ముందు ముందు?

Follow Us:
Download App:
  • android
  • ios