సంక్షేమ పథకాలను కూడా చెప్పుకోలేక పోతున్నందుకు నేతలపై ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్న చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొసమెరుపేంటంటే విశాఖపట్నంలో జెసి వీరంగంపై నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా మాట్లాడవద్దని కట్టడి చేయటం గమనార్హం.

‘సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పార్టీ కోసం తాను ఇటుక, ఇటుక పేరుస్తుంటే నేతలేమో వాటితో బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు’...ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చాలు నేతల వ్యవహారశైలిపై చంద్రబాబులో ఏ స్ధాయిలో ఆందోళన పెరిగిపోతోందో తెలుసుకోవటానికి. శనివారం అనంతపురం జిల్లా నేతలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ నేతల వ్యవహారశైలిపై మండిపడ్డారు. నేతల్లో పెరిగిపోతున్న క్రమశిక్షణా రాహిత్యంపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఎంపి జెసి దివాకర్ రెడ్డి వీరంగాన్ని ప్రస్తావించారు. నేతల ప్రవర్తనతో జనాల్లో పార్టీ పరువు పోతుందన్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయ్. మరి గతి తప్పిన నేతలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? జెసిపై చర్యలు తీసుకోవద్దని ఎవరైనా అడ్డుపడుతున్నారా? చర్యలు తీసుకుంటే ఏమవుతుందోనన్న భయంతో చంద్రబాబే చర్యలు తీసుకోవటం లేదన్నది వాస్తవం. అంతెందుకు ఈ సమీక్షలో జెసి ప్రభాకర్ రెడ్డి హాజరుకాలేదు. ఎందుకు హాజరుకాలేదని ఎవరైనా అడిగారా? గతంలో కూడా జిల్లా సమీక్షలకు జెసి సోదరులు చాలాసార్లే గైర్హాజరైనా ఏమీ చేయలేకపోయారు.

సరే ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడూ చెప్పారు. క్రమశిక్షణ తప్పిన నేతలపై చర్యలు తీసుకుంటారట. నేతలంతా ఇకపై ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలట. చేసిన సంక్షేమ పథకాలను కూడా చెప్పుకోలేక పోతున్నందుకు నేతలపై ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్న చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొసమెరుపేంటంటే విశాఖపట్నంలో జెసి వీరంగంపై నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా మాట్లాడవద్దని కట్టడి చేయటం గమనార్హం.